హసన్ పర్తి లో మట్టి ఇసుక మాయ….!

మట్టి ఇసుక దందాలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.లారీలకొద్ది మట్టిని తవ్వి నీటితో కడిగి ఇసుకను తీసి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. నాసిరకం ఇసుక దందాను యధేచ్చగా కొనసాగిస్తు కాసులు వెనకేసుకుంటున్నారు.

హసన్ పర్తి లో మట్టి ఇసుక మాయ....!- news10.app

హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల రెవెన్యూ పరిధిలో హసన్ పర్తి గ్రామ శివారులో మట్టి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది.కొందరు అక్రమార్కులు కాకతీయ కెనాల్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో రాత్రికి రాత్రే జేసీబీ,డోజర్ లను ఉపయోగించి మొరం మట్టిని తరలించి నీళ్ల మోటర్ల సహాయంతో మట్టిని ఇసుకగా మార్చి పట్టణాల్లో ని పలు ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువ పరిమాణంలో ఇసుకను డంపులుగా చేస్తూ రాత్రి సమయాల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో నగరంలోని హాసన్ పర్తి, భీమారం,గోపాలపూర్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు… మట్టి నుంచి ఇసుకను తీసి గృహ నిర్మాణ పనులకు ఈ నాసిరకం ఇసుకను విక్రహిస్తుండడంతో నిర్మాణం పనులు ఎంతటి నాణ్యతతో ఉంటాయోనని అనుమానాలు తలెత్తుతున్నాయి. హసన్ పర్తి శివారు పరిధిలోనే కాకతీయ కెనాల్ చుట్టుపక్కల ఇసుక అక్రమార్కులు జోరుగా తవ్వుతుండడం వల్ల ఈ ప్రాంతం అంత పెద్ద చెరువును తలపిస్తుంది…. మట్టి ఇసుక కోసం భారీ గోతులు తవ్వి మట్టి తరలించిన అనంతరం ఏర్పడ్డ గోతులు చాలా ప్రమాదకరంగా మరాయి. అడ్డగోలుగా మట్టి తవ్వడం మూలంగా భూగర్భజలాలు అడుగంటి పోయే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా ప్రభుత్వ భూముల్లో మట్టి తరలించాలంటే సంబంధిత రెవెన్యూ లేదా మైనింగ్ శాఖ నుండి అనుమతులు తప్పనిసరి కానీ అక్రమార్కులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అధికారుల అండదండలతో తమ వ్యాపారాన్ని అడ్డుఅదుపు లేకుండా కొనసాగిస్తున్నారు.ఈ చీకటి వ్యవహారం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకడుతున్నారో తెలియట్లేదని స్థానికులు వాపోతున్నారు.ఇకనైనా ఈ మట్టి ఇసుక అక్రమాదందాకు అధికారులు చెక్ పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here