మున్సిపల్ ఉద్యోగి వెంచర్ దందా….?

గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి రియల్టర్ అవతారమెత్తినట్లు తెలుస్తోంది. తను చేసే ఉద్యోగం కంటే కూడా రియల్ ఎస్టేట్ పైనే ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నట్లు సమాచారం .పేరుకే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేస్తూ గ్రేటర్ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ చేసి ప్లాట్లను అమ్ముతున్నాడని తెలిసింది…ఇతను ఉద్యోగి కనుక వెంచర్ ఏర్పాటు కోసం కొంతమంది అధికారులకు దగ్గరగా మెలుగుతూ వెంచర్ దందా పనికానిస్తున్నట్లు తెలుస్తుంది…ఏ అధికారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో బాగా తెలుసుకున్న ఈ ఉద్యోగి అనుమతులు లేని అక్రమ వెంచర్ దందా శరవేగంగా దూసుకుపోతున్నట్లు తెలిసింది…చేసే ఉద్యోగం కన్న వెంచర్ దందా పైనే అధిక దృష్టి సారించె ఈ మున్సిపల్ ఉద్యోగి విధులకు కూడా సరిగా హాజరుకాకుండా తరుచుగా డుమ్మాలు కొడుతాడనే ఆరోపణలు సైతం వినపడుతున్నాయి….

మున్సిపల్ ఉద్యోగి వెంచర్ దందా....?- news10.app

కొండపర్తి శివారులో అక్రమ వెంచర్

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహించే ఓ ఉద్యోగి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆరితేరినవాడుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ లు చేసే ఈ ఉద్యోగి ఇటీవలే హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి శివారులో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్రమంగా వెంచర్ చేసి ప్లాట్లను అమ్ముతున్నట్లు సమాచారం.అనుమతి లేని వెంచర్ లు చేసి అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని అమ్మకాలు సాగించడంలో ఈ మున్సిపల్ ఉద్యోగిది అందవేసిన చెయ్యి అని వరంగల్ లో ప్రచారం ఉంది

సబ్ రిజిస్ట్రార్ సహకారం…

వరంగల్ నగరం చుట్టూ వ్యవసాయ భూములను కొని ఎలాంటి నాలా కన్వర్షన్ లేకుండా కుడా అనుమతులు పొందకుండానే వెంచర్ లు చేసి ప్లాట్లను అమ్మే ఈ మున్సిపల్ ఉద్యోగికి ఓ సబ్ రిజిస్ట్రార్ బాగానే సహకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది.ప్రభుత్వం అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని నిబంధనలు పెట్టినా ఈ సబ్ రిజిస్ట్రార్ అవేమీ పట్టించుకోకుండా ఈ మున్సిపల్ ఉద్యోగి చేసే అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను నిబంధనలు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ పూర్తి స్థాయిలో సహకరిస్తుండడంతో ఈ ఉద్యోగి రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని అక్రమ వెంచర్ లు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here