నగరంలో అర్హత లేని వైద్యుడు

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే అర్హత పరీక్షలో ఢక్కా మొక్కీలు తింటూ… ఎన్ని సార్లు పరీక్ష రాసిన అర్హత సాదించని ఓ వైద్యుడు వైద్యం చేస్తూ ఏకంగా ఓ ఆస్పత్రినే నిర్వహిస్తున్నాడు… ఇతర దేశంలో ఎం బి బి ఎస్ పూర్తి చేసి మనదగ్గర ఎం సి ఐ నిర్వహించే అర్హత పరీక్ష లో పాస్ ఐయితేనే వైద్యం చేయాలని నిబంధన ఉన్న ఈ వైద్యుడు అవేమి పట్టించుకోవడం లేదు. వివిధ దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిని మనదేశంలో ఎంబీబీఎస్ గా గుర్తించాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది ఈ పరీక్షలో అర్హత సాధించిన వారినే ఎంబీబీఎస్ గుర్తిస్తారు .కానీ కానీ ఈ వైద్యుడు@ ఎంబీబీఎస్ రష్యా లో ఎంబీబీఎస్ చేసినట్టు చెప్పుకుంటున్నాడే తప్ప మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించలేదు. అంటే ఈ వ్యక్తి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అనర్హుడు కానీ ఇదేమీ పట్టించుకోకుండా దర్జాగా తన క్లినిక్ లో వైద్యం చేస్తున్నాడు…

నగరంలో అర్హత లేని వైద్యుడు- news10.app

హసన్ పర్తి కేంద్రంగా ఆసుపత్రి నిర్వహణ

హన్మకొండ జిల్లాలోని హసన్ పర్తిలో ఈ సారు అర్హత లేకున్న ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టి మరీ వైద్యం చేస్తున్నట్లు తెలుస్తోంది …మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలో ఫెయిల్ అయిన ఈ అర్హత లేని వైద్యుడు తన పేరు మీద ఆసుపత్రి నిర్వహణకు అనుమతులు రావు కనుక తన భార్య పేరుమీద అనుమతులు తీసుకొని దర్జాగా ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నట్లు సమాచారం. అర్హత లేకున్నా దర్జాగా ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టుకొని హాస్పిటల్ కి వచ్చే పేషెంట్ లకు వచ్చిరాని ట్రీట్మెంట్ చేస్తుండడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని కొంతమంది వైద్యులు చెబుతున్నారు

అర్హతలేని ఎంబీబీఎస్ ఎమ్మెల్యే బంధువుట ….

హన్మకొండ జిల్లాలోని హసన్ పర్తిలో అర్హతలేకున్న ఎంబీబీఎస్ గా చెలామణి అవుతున్న ఈ డాక్టర్ టి ఆర్ ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే కు దగ్గరి బంధువు అని తెలిసింది.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలో ఫెయిల్ అయిన అర్హత లేని ఈ ఎంబీబీఎస్ దర్జాగా ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్న జిల్లా వైద్యశాఖ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది… అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గరి బంధువు కాబట్టే చర్యలు తీసుకోవాల్సిన “ఐఎంఏ ” గమ్మునున్నట్టు జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here