మా కొడుకును చంపేశారు…

ఆత్మహత్య కాదది హత్య…?

పందొమ్మిది సంవత్సరాల యువకుడు… ఎదురింటి యువకుడు పని ఉంది తనతో రావాలని కోరగా సరేననివేళ్ళాడు ఇరవై నాలుగు గంటలు గడిచింది… తీసుకెళ్లిన యువకుడు గ్రామంలోనే తిరుగుతున్నాడు ఆ అబ్బాయి ఆచూకీ మాత్రం తెలియడం లేదు… దింతో అబ్బాయి తల్లిదండ్రుల్లో కలవరం మొదలయింది అంతటా వెతికారు… చుట్టాలను పక్కాలను మావాడు వచ్చాడా…? అని ఆరా తీశారు ఐయిన ఆచూకీ తెలియలేదు. తెల్లవారేసరికి గ్రామ శివారు లోని వ్యవసాయ బావిలోనే శవమై తేలాడు.అసలు ఎం జరిగింది.. ఆ అబ్బాయి మరణానికి కారకులు ఎవరు? అది ఇంతకు హత్య, ఆత్మహత్య, ఆరోజు పోలీసుల హడావుడి ఎందుకు చేశారు…? బాధిత కుటుంబం నుంచి పిటిషన్ తీసుకునేందుకు ఆ ఏ ఎస్సై ఎందుకు నిరాకరించాడు…? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు భాదిత కుటుంబాన్ని మరింత బాధకు గురిచేస్తున్నాయి… ఎదిగిన తమ కుమారుడు మరణం ఆత్మహత్య కాదని అది ఖచ్చితంగా హత్యేనని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు… న్యాయం చేయండి తమ ఫిర్యాదును తీసుకోండి అంటే పోలీసులు బూతులు తిడుతున్నారు.

మా కొడుకును చంపేశారు...- news10.app

సాక్ష్యులను ఎక్కడినుంచి తెస్తావ్ అంటూ ఎదో కేసు నమోదు చేస్తాం అంటూ పోలీసులు అంటున్నారని బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు… అకారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన పట్టించుకోని పోలీసులను వారు ప్రశ్నిస్తున్నారు… భాదితులు న్యూస్10 కు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండలం మాల్యాల గ్రామానికి చెందిన రాములు, స్వప్న ల ప్రథమ కుమారుడు గురుకుంట్ల అజయ్ (19) పదవతరగతి చదివి తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహకరిస్తూ ఇతర కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే మండలం సిరిసేడు గ్రామానికి చెందిన ఓ యువతికి అజయ్ డబ్బులు ఇవ్వాలని ఆ యువతి బంధువులు అతడు ఇంట్లో లేని సమయంలో వచ్చి తల్లిదండ్రులను బెదిరించి వెళ్తారు… మీ కొడుకు అంతు చూస్తాం అంటూ వార్నింగ్ సైతం ఇస్తారు… ఈక్రమంలో మృతుడు అజయ్ ఇంటి ఎదురుగా ఉండే కట్ట రాజు అనే వ్యక్తి ఎదో పని ఉందని అతన్ని వెంట తీసుకెళ్తాడు రోజు గడుస్తున్నా అజయ్ మాత్రం ఇంటికి రాడు… అతన్ని తీసుకెళ్లిన రాజు మాత్రం గ్రామంలోనే తిరుగుతుంటాడు… ఇది గమనించిన తల్లిదండ్రులు తమ కొడుకు ఎక్కడ అని ప్రశ్నించిన రాజు నుంచి ఎలాంటి సమాదానం ఉండదు. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు అంతటా వేతుకుతారు… ఐయిన ఆచూకి దొరకదు. చివరకు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద అజయ్ సైకిల్, చెప్పులు కనిపిస్తాయి అనుమానంతో అక్కడ వేతకగా తమకుమారుడు బావిలో శవమై తేలి కనిపిస్తున్నాడని తల్లిదండ్రులు రోదిస్తూ చెప్పారు… వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి పిర్యాదు చేస్తే సంఘటన స్థలానికి చేరుకున్న ఏ ఎస్సై కనీసం తమ తమ పిర్యాదు తీసుకోకుండా… మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన పట్టించుకోకుండా ఎదో నామమాత్రంగా శవ పంచనామా చేసి హడావుడిగా పోస్టుమార్టం తరలించి కనీసం చివరి చూపు కూడా సరిగా చూసుకోకుండా చేశారని మృతుని తల్లిదండ్రులు ఆరోపించారు.

వారే హత్య చేశారు…

తమ కుమారుడు డబ్బులు ఇవ్వాలని తమ ఇంటికి వచ్చి బెదిరించి అంతు చూస్తామని చెప్పి… కనపడకుండ పోయిన తర్వాత కూడా మీ కొడుకు పని ఐయిపోయిందని పోన్ చేసి బెదిరించిన రేనుకుంట్ల రవి తమకుమారుడిని చంపి బావిలో వేశారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఇందులో కట్ట రాజు పాత్ర కూడా ఉందని తమ కుమారుడిని ఇంటినుంచి బయటకు అతడే తీసుకువెళ్లాడని వారు కన్నీటిపర్యంతమయ్యారు.

పోలీసుల ఉదాసీనత….?

తమ కుమారుడు కనిపించకుండా పోయిన ,వ్యవసాయ బావిలో శవమై తేలిన ఇళ్లందకుంట పోలీసులు కనీసం పట్టించుకోలేదని పిటిషన్ తీసుకోవడానికి సైతం వెనుకాడారని… తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని చెపుతున్న పట్టించుకోకుండా వారే స్వీయ నిర్ణయం తీసుకొని ఎఫ్ ఐ ఆర్ చేసి ఆతర్వాత పిటిషన్ ఎందుకురా…మీకు సాక్షులను తెస్తారా…? అని తిడుతూ అయిష్టంగానే పిర్యాదు తీసుకున్నారని వారు చెప్పారు. తమ కొడుకు చనిపోయి పది రోజులు గడుస్తున్నా ఇప్పటికి ఎవరిని పోలీసులు అరెస్ట్ చేయలేదని తమ కొడుకుని హత్య చేసిన వారు పక్క గ్రామంలో జల్సాలు చేస్తూ తిరుగుతున్న పోలీసులకు ఏమాత్రం కనపడడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ తమ కుమారుడి మృతిని హత్య కేసుగా నమోదు చేసి తమ కుమారున్ని చంపి బావిలో వేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడు అజయ్ తల్లిదండ్రులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here