పైరవీకే పదోన్నతి….?

నీటిపారుదల శాఖలో పదోన్నతుల కోసం పైరవీల జోరు కొనసాగుతుంది.అర్హత సీనియారిటీ ఉన్నా లేకున్నా రాజకీయ ఆర్థిక పలుకుబడిని ఉపయోగిస్తే చాలు అది ఎంత పెద్ద పదోన్నతి అయినా సరే తెల్లవారేసరికి అదనపు బాధ్యతల పేరుతో ఆర్డర్ రెడీ అవుతుంది. పదవి కావాలనుకునే అధికారి రిటైర్ అయినా పర్వాలేదు. సర్వీస్ సీనియారిటీ ఉన్న ఉద్యోగులు ఎంతమంది ఉన్నా ఏం కాదు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆశీస్సులు ఉంటే పదోన్నతి మాత్రం పక్కా… ఇది నీటిపారుదల శాఖ వరంగల్ యూనిట్లో జరుగుతున్న తతంగం.

పైరవీకే పదోన్నతి....?- news10.app

ఇక వివరాల్లోకి వెళితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో పదవీకాలం ముగిసిన అధికారి సంబంధిత శాఖలో ఉన్నత పదవిని దక్కించుకున్నాడు. తనకంటే ఎంతో మంది సీనియర్లు ఉన్న వారికి రాని అవకాశం ఇతగాడికి వచ్చిందంటే ఇక ఏ స్థాయిలో పైరవీ చేశాడనేది మనకు ఇట్టే అర్థం అవుతుంది ఎమ్మెల్యే సదరు ఉద్యోగి ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతోనే కావడంతోనే ఈ అవకాశాన్ని అలవోకగా అందిపుచ్చుకున్నాడట ఏఈ గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన అధికారి తన కంటే ఎంతో మంది పై అధికారులను నిలువరించి ఆనతి కాలంలోనే ఆ శాఖను శాసించే స్థాయిలో నిలిచాడట దీంతో పదోన్నతి అవకాశాలకోసం ఎదురు చూస్తున్నా సీనియర్ ఉద్యోగులు తమ బాధలు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. అంతేకాదు ఈ సారు తన ఉద్యోగం కోసమే కాదు అవుట్సోర్సింగ్ విభాగంలో ఉద్యోగాలు ఇప్పించి డబ్బులు దండుకోవడంలో కూడా సిద్ధహస్తుడట. గతంలో ఇదే విషయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అతనిపై ఓ విచారణ కమిటీ కూడా పడిందట అంతేకాదు తన కింద పనిచేసే మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసుల వరకు వెళ్లిన సందర్భాలు లేకపోలేదు ఇక ఈ సారుకు కాంట్రాక్టర్లు అంటే ఎనలేని ప్రేమట ఎప్పుడు వారిచ్చే తాయిలాలపైనే మక్కువట సామాన్యులంటే అస్సలు గిట్టదట తాయిలాలు అందితే కాంట్రాక్టర్లు చేసే పని యొక్క అంచనా వ్యయం కూడా పెరుగుతుందట అంతేకాదు బిల్లులు కూడా వెనువెంటనే విడుదల అవుతాయట ఈ వ్యవహారానికి అలవాటు పడ్డ సారూ ఉద్యోగంలో చేరినాడు ఊర్లో ఉన్న రెండు ఎకరాల పొలం ఇప్పుడు వందల ఎకరాల మామిడి తోటలు గా హైదరాబాద్ లో విలాసవంతమైన విల్లాలుగా మారాయట రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటూ ఇతగాడు కాంట్రాక్టుల కోసం చేసే పైరవీలు అన్నీ ఇన్నీ కావట.ప్రస్తుతం నీటి పారుదల శాఖలో ఉన్నత పదవిలో ఉన్న ఈ అధికారికి నిబంధనలకు విరుద్ధంగా ఈ మధ్యకాలంలో లో మరో అదనపు బాధ్యతలు కూడా అప్పగించారట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here