పోతారంలో వెంచర్ మాయ

ఆకర్షణీయమైన పేర్లు పెడతారు, రంగురంగుల బ్రోచర్ లు ముద్రిస్తారు… సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రచారం చేస్తారు… అమాయకమైన ప్రజలను ఇట్టే బుట్టలో పడేస్తారు… వెంచర్ లో ఫ్లాట్ లు కూడా చేయకముందే అడ్వాన్స్ బుకింగ్ ల పేరుతో అమ్మకాలు కూడా ప్రారంభిస్తారు. ఇదంతా పేపర్ లపై చూసే జనాలు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ వెంచర్ అక్రమమా…?సక్రమమా…? ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంచర్ ఉందా? సౌకర్యాలు ఉన్నాయా? అని ఏవి కూడా చూసుకోకుండా ప్లాట్లు కొనుగోలు చేస్తారు… సరిగ్గా ఇదే రీతిలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం లో రియల్టర్లు 10 ఎకరాల భూమిలో ఓ వెంచర్ ఏర్పాటు చేశారు… చుట్టూ ప్రహారీ నిర్మించారు. నేల మొత్తం చదును చేశారు… మట్టి రోడ్లు వేశారు ఇంకేముంది వెంచర్ సిద్ధం చేశామని కొనుగోళ్లు ప్రారంభించారు. అనుమతుల మాట అలాఉంచితే అసలు వెంచర్ నిబంధనలు ఏమి పాటించకుండానే వెంచర్ సిద్ధం చేశామని గజానికి ఇంత అని ఓ ధర నిర్ణయించి అప్పుడే వెంచర్ నిర్వాహకులు అమ్మకాలు ప్రారంభించారట.

పోతారంలో వెంచర్ మాయ- news10.app

నిభందనలకు తూట్లు…

ప్రభుత్వ నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా సంపాదనే లక్ష్యంగా ప్లాట్ల అమ్మకాలకు సిద్ధపడుతున్నారని ఇక్కడ విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణంగా వెంచర్ చేయాలంటే కనీస నిబంధనలు అయినటువంటి రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ స్తంభాలు, పార్క్ తదితర సౌకర్యాలతో వెంచర్ చేయాలి కానీ ఈ రియల్టర్లు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వెంచర్ ఏర్పాటు చేశారు. ఇదంతా చూస్తుంటే అసలు ఈ వెంచర్ కు అనుమతులు ఉన్నట్టా? లేనట్టా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ అనుమతులు ఉంటే నిబంధనల ప్రకారం వెంచర్ ను ఎందుకు సిద్ధం చేయలేదో వారికే తెలియాలి. ఇన్ని ఎకరాల్లో వెంచర్ వేస్తున్నప్పుడు నిభందనలకు విరుద్ధంగా ఎందుకు ఈ వెంచర్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారో అర్థం కాని విషయం.

అదికారుల నిర్లక్ష్యం…

ఇంత బహిరంగంగా ఇష్టారాజ్యంగా వెంచర్ జరుగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. పది ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ సిద్ధం చేసి అమ్మకాలు కొనసాగిస్తుంటే కనీసం వారిని ప్రశ్నించకుండా ఉండడం, ఈ అధికారుల మౌనానికి రియల్టర్లు ఇచ్చే ముడుపులే కారణమని పలువురు బహిరంగంగానే అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఇకనైనా అధికారులు వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నిభందనలకు విరుద్ధంగా ఉన్న వెంచర్ ను నిలిపివేయాలని పలువురు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here