ఏపీలో శానిటైజర్ తాగిన వైద్యాధికారి..!

అనంతపురం జిల్లాలో ఓ వైద్యాధికారి శానిటైజర్ తాగారు. జిల్లాకు చెందిన వైద్యాధికారి అనిల్ మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నఆయన ఫోన్ మాట్లాడుతూ శానిటైజర్ ను తాగినట్టు తెలుస్తోంది. వెంటనే అతన్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సానిటైజర్ తాగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత రామిరెడ్డి ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వైద్యాధికారి చికిత్స పొందుతున్నారు. అయితే డాక్టర్ శానిటైజర్ తాగడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే తాగారా? లేదంటే ఆక్సిడెంట్ గా తాగారా అన్నది తెలియాల్సి ఉంది.