అవసరం లేకున్న వస్తే టెక్నాలజీతో చెక్ – వరంగల్ పోలీస్ కమీషనర్ డా. వి. రవీందర్

లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారులను కట్టడి చేసేందుకు వరంగల్ పోలీస్ కమీషనరేట్ పోలీసులు టెక్నాలజీని వినియోగంలోకి తీసుకవరావడం జరిగిందని వరంగల్ పోలీస్ కమీషనర్ బుధవారం ప్రకటించారు.

కరోనా వ్యాధిని కట్టడి కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ప్రకటించిన కూడా ఆవసరం లేకున్న రోడ్ల మీదకు వచ్చే కొందరు వాహనాదారులను కట్టడి చేసేందుకు గాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం నూతనంగా రూపొందించబడిన సిటిజన్ ట్రాకింగ్ అప్లికేషన్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకరావడం జరిగింది.

ఈ అప్లికేషన్ ద్వారా రోడ్డు మీదకు ఒక వ్యక్తి లేదా వాహనదారుడు ఎన్నిమార్లు రోడ్డు మీదుకు వచ్చాడు, ఎన్ని పోలీస్ చెక్ పాయింట్లను దాటాడు లాంటి పూర్తి సమాచారాన్ని పోలీసులు తెలుసుకోవడం సులభతరం అవుతుంది. ఈ అప్లికేషన్ ద్వారా ముందుగా పోలీసులు చెకింగ్ పాయింట్ వద్దకు వచ్చే వాహనదారులకు సంబంధించిన పూర్తి వివరాలను అనగా వాహనదారుని పేరు లేదా సెల్ నంబర్ లేదా ఆధార్ లేదా వాహనం నంబర్లతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఈ అప్లికేషన్ ద్వారా సేకరించడం జరుగుతుంది. ఇలా సేకరించిన సమాచారం వాహహనదారుడు లాక్ డౌన్ ను అతిక్రమించి ఒక చెక్ పాయింట్ నుండి మరొక చెక్ పాయింట్ కు చేరుకున్నప్పుడు సదరు వాహనదారుడు ఎన్నిమార్లు రోడ్లమీదకు వచ్చాడు ఎంత దూరం నుండి వచ్చాడు, ఎన్ని చెక్ పాయింట్లను దాటి వచ్చాడు అనే సమాచారాన్ని పోలీసులు తెలిసుకొనేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడటంతో పాటు అనవసరంగా వస్తే వాహనదారునిపై చర్యలు తీసుకోవడం మరియు వాహనం సీజ్ లాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమీషనర్ తెలిపారు.