హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురింసింది. బేగంపేట్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్, కూకట్‌పల్లి, మూసాపేట్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, బాలానగర్ బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, జెబిఎస్‌, కార్కానా, ప్యాట్నీ, సికింద్రాబాద్‌, చిలకలగూడ, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురింసింది.

తెలంగాణలో రాగల మూడు రోజుల్లో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.