కరోనా టెస్టులు ఫ్రీ.. సుప్రీంకోర్టు కీలక సూచన !

కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలన్న పిల్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 118 ల్యాబ్ లు ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపారు సొలిసిటర్ జనరల్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 118 ల్యాబ్స్ సరిపోవన్న సొలిసిటర్ జనరల్.. 47 ప్రైవేట్ ల్యాబ్‌లను కరోనా పరీక్షలకు ఉపయోగిస్తున్నామని తెలిపారు.

కరోనా టెస్టులు ఫ్రీ.. సుప్రీంకోర్టు కీలక సూచన !- news10.app

అయితే ప్రైవేట్ ల్యాబ్స్ లో అధిక ఫీజులు వసూలు చేయకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గుర్తించిన ప్రైవేట్ లేబొరేటరీల్లో జరుగుతున్న కోవిడ్ టెస్టుల్ని ఫ్రీగా నిర్వహించాలని ఈ విషయం మీద త్వరలోనే ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది. అలాగే కోవిడ్ టెస్టుల కోసం ప్రభుత్వాల నుంచి రీయింబర్స్ మెంట్ పాలసీను కూడా అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది.

అయితే సుప్రీం సూచనలపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై పరిశీలించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు వైద్యసిబ్బందికి.. పీపీఈలు, భద్రత అంశాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై వివరణ ఇచ్చిన అటార్నీ జనరల్.. వైద్యసిబ్బంది రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here