ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు

డీఐజీలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  2006 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు డీఐజీలుగా ఇప్పటికే పదోన్నతులు కల్పించారు. తాజాగా వారికి డీఐజీ ర్యాంకు స్థాయిలో పోస్టింగ్‌లు ఇచ్చారు.

డీఐజీ హోదాలో నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌గా కార్తికేయ కొనసాగుతారు. డీఐజీ హోదాలో రాజబహద్దూర్‌ వెంకటరామిరెడ్డి పోలీస్‌ అకాడమీ ఉప సంచాలకులుగా రమేష్‌ నాయుడు బాధ్యతలు నిర్వర్తిస్తారు. డీఐజీ హోదాతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌గా సత్యనారాయణ కొనసాగుతారు. సీఐడీ విభాగంలో డీఐజీలుగా సుమతి, శ్రీనివాసులు బాధ్యతలు నిర్వర్తిస్తారు. సైబరాబాద్‌ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌గా వెంకటేశ్వరరావును నియమించారు. మాదాపూర్‌ డీసీపీగా కూడా ఆయన పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.