అసెంబ్లీ ముట్టడికి ఆరే కటికల యత్నం…

తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆరే కటికలు గురువారం అసెంబ్లీ ముట్టడి నిర్వహించారు… ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపాలపల్లి అశోక్ దాదా చలో అసెంబ్లీ కార్యక్రమం కాచిగూడ నుంచి ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మండలాల నుంచి ఆర కటికలు భారీ ఎత్తున పాల్గొన్నారు… ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు అశోక్ దాదా మాట్లాడుతు ఆరే కటిక
కులాన్ని గుర్తించింది లేదని, వారి ప్రస్తావన లేదని, ఆరెకటిక ల కష్టనష్టాలు పట్టించుకునే నాయకుడు లేడని వాపోయారు.

అసెంబ్లీ ముట్టడికి ఆరే కటికల యత్నం...- news10.app

కులవృత్తి లో వేరే వారిని ప్రభుత్వం ప్రోత్సహించడం చాలా బాధాకరమన్నారు. వృత్తి ని తామే చేసుకునేలా.., 500 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, బి సి డి నుంచి తొలగించి బీసీ ఎ లో తమను చేర్చాలని, ఆరెకటిక వృత్తికి భద్రత కల్పించాలని, టీ మటన్ షాప్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరే కటికల బాధలు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ గ గుర్తించాలని కోరారు. ఆరే కటికల చలో అసెంబ్లీ యాత్ర అసెంబ్లీ ముందుకు వెళ్ళేసరికే భారీ ఎత్తున జనాలు రావడంతో వెంటనే అక్కడి పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకొని వారిని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల ప్రెసిడెంట్ డాక్టర్ జయందర్ ఆధ్వర్యంలో వరుణ్ ఏ.శ్రీనివాస్, కె మదన్ లాల్, కె శ్రీనివాస్, సురేందర్, కిరణ్ సందీప్ బాల్రాజ్ మహేష్ భువనగిరికి వెంకటేష్ నాగ శేషు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.