రాజేంద్రుడి అవినీతి లీల…..

రెవెన్యూ శాఖలో ఆ రాజేంద్రుడి లీలలు అన్ని ఇన్ని కావట…పైసా ముట్టనిదే అసలు పనే చేయని ఆయన రూటే సపరేటట. మొన్నటి వరకు కలెక్టరేట్ లో ఓ విభాగానికి అధికారిగా వ్యవహరించిన ఆయన తీరు వివాదాస్పదమేనట…ఇది గమనించిన ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తే గంటల వ్యవధిలోనే బదిలీ చేసుకున్న మహాఘనుడు ఈ రాజేంద్రుడట. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ శాఖలో అందినకాడికి దండుకుంటాడనే పేరును కూడా దండిగానే సంపాదించుకున్నాడట.

రాజేంద్రుడి అవినీతి లీల.....- news10.app

ఇది అవినీతి లీల….

అవినీతి రాజేంద్రుడి లీలలను రెవెన్యూ శాఖలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.కింది స్థాయి ఉద్యోగులను సైతం ఏ పని కావాలన్న రాచి రంపాన పెడతాడనే పేరుందట.కలెక్టరేట్ కార్యాలయంలో అధికారిగా పనిచేసేటప్పుడు సమస్యలతో ఎవరు వచ్చిన తన బినామీ చేత వారితో మాట్లాడించి కావాల్సింది దండుకొని పని చేసి పెట్టడం ఇతగాడి అక్రమ తెలివి.ఇలాగే గత కొద్దిసంవత్సరాలుగా తమ భూమి పట్టా కావడం లేదని కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఓ భూయజమాని తో తన బినామీ చేత మాట్లాడించి ఖాజీపేట లో ఓ అధికారికి ఇవ్వాలని ఐదు లక్షలు తీసుకొని పట్టా పని చేసినందుకు అక్షరాల నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఎకరం ఐదు గుంటల భూమిని తన అక్రమ ఖాతాలో తహశీల్దార్ వేసుకున్నట్లు తెలిసింది.అలాగే గీసుగొండ మండలం లోని ఆరు ఎకరాల భూమిని నిషేధిత జాబితాల్లోంచి తీసివేసి పనిచేసి పెట్టినందుకుగాను సదరు భూమి యజమాని నుంచి వినాయక చవితి పండుగ పూట తన ఇంటిలోనే రెండు లకారాలు లక్షణంగా పుచ్చుకొని పండుగ పూట తాను ఏమి ముట్టుకోనని డబ్బులు అక్కడ పెట్టమని సెలవిచ్చి అక్కడికి తాను నీతివంతుడనని పోజులుకొట్టాడట. అలాగే ఇదే మండలంలోని కొనాయమాకుల దగ్గర ఉన్న ఐదు ఎకరాల 38 గుంటల భూమి గత 15 సంవత్సరాలుగా వివాదంలో ఉండగా అభూమి కి ఎలాంటి రికార్డులు కూడా లేవు కానీ ఆ భూమిని క్లియర్ చేయడానికి రంగంలో దిగిన తహశీల్దార్ రెండు వందల గజాల భూమిని అగ్రిమెంట్ చేసుకున్నాడట..ఖర్చుల నిమిత్తం అంటూ ఐదు లక్షల రూపాయలను తీసుకున్నట్లు తెలిసింది.అగ్రిమెంట్ చేసుకున్న భూమిని డీపీ నంబర్ రాగానే రేపో మాపో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తహశీల్దార్ సాబ్ సిద్ధంగా ఉన్నాడట.

బాదుడే ….బాదుడు..

కలెక్టరేట్ లో ఈ తహశీల్దార్ ఉద్యోగం చేస్తున్నప్పుడు విఆర్వో, విఆర్ఎ లకు ఎ సమస్య ఉన్న తాను ఉన్నానంటు ముందుకువచ్చే వాడట ….ముందుకు రావడం అంటే సాయం చేయడం కోసం అని మనం అనుకుంటే తప్పులో కాలేసినట్లే…అలాకాదట సస్పెండ్ ఐయిన విఆర్వో, వి ఆర్ ఏ లను తిరిగి విధుల్లో తీసుకునేలా చేస్తామని చెప్పి చాలామంది దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.సర్వీస్ విషయాలు,పే స్కెలు తదితర విషయాల్లో సైతం ఎంత తోస్తే అంత దండుకొని ఈ తహశీల్దార్ తన అక్రమ లీలలు ప్రదర్శించేవాడట.

ఆస్తులన్ని బినామీ పైనే….?

అక్రమ లీలలతో కోట్లకు ఎగబాకిన తహశీల్దార్ తన ఆస్తులన్నింటిని బినామీ పేరుపైనే ఉంచినట్లు గా విశ్వసనీయ సమాచారం.కలెక్టరేట్ లో ఉద్యోగం చేసేటపుడు ఈ బినామీ ఎప్పుడు ఆ కార్యాలయంలో దర్శనం ఇచ్చేవాడట.విలాసవంతమైన భవనాలు ,వాహనాలు సైతం భారీగానే ఇతగాడు సమకూర్చుకున్నట్లు తెలిసింది

ఆ మండలంలోను అదే తీరు…

కలెక్టర్ కార్యాలయంలో నుండి ఇటీవలే ఆ మండలానికి తహసీల్దార్ గా బదిలీ పై వెళ్లిన సదరు అధికారి తన తీరు మార్చుకోవట్లేదని పలువురు ఉద్యోగులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే ఆ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు తన భూమిని మ్యూటేషన్ చేపించుకోగా ఒరిజినల్ పత్రాలు ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నాడట. దీంతో ఆ రైతు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.మరి ఇంతటి అవినీతి ఘన చరిత్ర కలిగిన తహశీల్దార్ పై అధికారులు ఎం చర్యలు తీసుకుంటారో చూడాలి.

తహశీల్దార్ గారి బదిలీ రహస్యం….!

మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here