మునిసిపల్ లో వసూల్ రాజా…..!

అంగట్లో జి డబ్ల్యు ఎం సి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో వసూల్ రాజల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది… కొందరు అధికారులనుంచి మొదలుకొని కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో సైతం కొందరు వసూల్ రాజాలు అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, ఎదో ఉద్యోగం చేసుకొని బతుకుదామనుకున్న వారి ఆలోచనను కొందరు వసూల్ రాజాలు తమకు అనుకూలంగా మార్చుకొని వసూళ్లకు ఎగబడుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో సానీటరీ జవాన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఇలాంటి పనే చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టిస్తానని బరితెగించి లక్షల్లో వసూళ్లు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది.

మునిసిపల్ లో వసూల్ రాజా.....!- news10.app

ఉద్యోగానికి రెండు లక్షలు….

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో అతనొక సానీటరీ జవాన్..ఔట్ సోర్సింగ్ కింద తాను పనిచేస్తున్న విభాగంలో పనిచేయాడానికి పారిశుద్ధ్య కార్మికులు కావాలని ,ఈ ఉద్యోగం కావాలంటే ఒక్కోక్కరు రెండు లక్షలు ఇవ్వాలని ఇలా ఒకే రోజు నలుగురి దగ్గర ఆ సానీటరీ జవాన్ ఎనిమిది లక్షలు వసూల్ చేసాడు.వరంగల్ నగరంలోని ఓ వార్డు కార్యాలయం ఆవరణలో బహిరంగంగా డబ్బులు తీసుకుంటూ వీడియో కెమెరాకు అడ్డంగా బుక్ అయ్యాడు.రెండు లక్షలు ఎక్కువైయింది లక్ష యాభై తీసుకోమని బ్రతిమిలాడిన సానీటరీ జవాన్ పైసా తగ్గేదిలేదని తెగేసి చెప్పి అక్షరాల ఎనిమిది లక్షలు పట్టుకొని చల్లగా జారుకున్నాడు.

ప్రతి ఉద్యోగానికో రేటు…?

వరంగల్ మున్సిపల్ కార్యాలయం కేంద్రంగా కొంతమంది అధికారులు,ఇతర ఉద్యోగులు ప్రతి ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగాలను అంగట్లో వస్తువులను అమ్మినట్లు లక్షల్లో దండుకొని అమ్మేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంకొంతమంది అసలు ఉద్యోగాలు లేకున్నా ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలల్లో వసూల్ చేసి ఉద్యోగాలు ఇప్పించక డబ్బులు తిరిగి ఇవ్వక మోసాలు చేస్తున్నట్లు తెలిసింది.ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చిన వారు చెప్పులరిగెల తిరిగిన లాభం లేకుండా పోతుందట. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి సైతం ఉద్యోగాల పేరుతో బాగానే వసూలు చేశాడని డబ్బులు తిరిగి ఇవ్వమంటే రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నాడని సమాచారం.

వసూళ్ల వెనుక ఎవరు…?

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకం వెనుక మున్సిపల్ అధికారి ఒకరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది… ఇతగాడే సానీటరీ జవాన్ ల ద్వారా వసూల్ చేస్తూ తన చేతికి మట్టి అంటకుండా వసూల్ చేసినందుకు వారికి కమీషన్ ఇస్తూ ఉద్యోగాల అమ్మకం దందా జోరుగా నడుపుతున్నట్లు తెలిసింది.ఉద్యోగాల అమ్మకం పై మున్సిపల్ ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here