రింగ్ రోడ్డు చుట్టూ రియల్ దందా….?

హన్మకొండ రింగ్ రోడ్డు చుట్టూ రియల్ దందా జోరుగా సాగుతోంది… ఈ అక్రమ రియల్ దందాలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు దూసుకుపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది… ఓ చిట్ ఫండ్ లో వాటాలు పెట్టిన ఆ ప్రజాప్రతినిధి తన కుమారుడి రియల్ దందాకు సహకారం అందిస్తున్నట్లు సైతం ప్రచారం సాగుతోంది…

రింగ్ రోడ్డు చుట్టూ రియల్ దందా....?- news10.app

ఖాతాదారుల చిట్ డబ్బులే పెట్టుబడిగా కొన్ని చిట్ ఫండ్ లు కొనసాగిస్త్తున్న ఈ రియల్ దందాకు ఇంకొంతమంది ప్రజాప్రతినిధులు సైతం షాడోల వ్యవహరిస్తూ సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ వెంచర్ల లోని ప్లాట్ లను చిట్ ఫండ్ లోని ఖాతాదారులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…. ఇంతజరుగుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఓ ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు ఈ దందా వెనకాల ఉండడంవల్ల అధికారులు కిమ్మనడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి….. తండ్రి ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని రియల్ దందాలు చేస్తున్న ఆ పుత్ర రత్నం ఎవరు….? రింగ్ రోడ్డు చుట్టూ కొనసాగుతున్న ఆ రియల్ దందా కథ ఏంటి….చిట్ ఫండ్ ల వెంచర్ దందాల రహస్యం ఏంటి… వీటన్నింటిపై సమగ్ర వార్త కథనాలు త్వరలో అందిస్తాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here