పశ్చిమ తెరపై కోరబోయిన….?

తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేసి గులాబీని వీడి కమలం పార్టీలో చేరిన కోరబోయిన సాంబయ్య వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కమలం తరుపున బరిలో నిలవనున్నట్లు నియోజకవర్గం లో ప్రచారం జరుగుతోంది….. ఇప్పటికే కోరబోయిన నియోజకవర్గం లోఉన్న వివిధ డివిజన్ లల్లో తన అనుచరుల ద్వారా తనకున్న అనుకూల పరిస్థితులపై ఆరా తీసి గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు తెలుస్తుంది…. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో బీజేపీ నుంచి బరిలో నిలవాలని ప్రస్తుత హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ఎవరి ప్రయత్నాల్లో వారుండగా తాజాగా బీజేపీ లో కోరబోయిన సాంబయ్య పేరు తెరపైకి వచ్చింది.

పశ్చిమ తెరపై కోరబోయిన....?- news10.app

బీజేపీ ఓ బి సి మోర్చా రాష్ట్ర ఉపాదక్ష్యుడిగా ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్న ఆయన రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు బాగానే తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది…. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అప్పటి టి ఆర్ ఎస్ పార్టీ నుంచి మొట్టమొదటి ప్రజాప్రతినిదిగా హన్మకొండ నుంచి జెడ్పీటీసీ గా గెలుపొందిన కోరబోయిన సాంబయ్య అప్పటినుంచి గులాబీ పార్టీలోనే కొనసాగుతూ 2016 లో టి ఆర్ ఎస్ నుంచి 37 డివిజన్ కార్పొరేటర్ గా సైతం గెలుపొందారు… ప్రస్తుత పశ్చిమ ఎమ్మెల్యే తో అత్యంత సన్నిహితంగా మెదిలిన కొరబోయినకు పశ్చిమ నియోజకవర్గం మొత్తంగా పరిచయాలు ఉండడం బరిలో నిలిస్తే లాభిస్తాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు….

సామాజిక కోణం…

పశ్చిమ బరిలో నిలవాలని భావిస్తున్న బీజేపీ నేత కోరబోయిన సాంబయ్య బిసి సామాజిక కోణంలో సైతం తనకు లాభిస్తుందనే అంచనాలో ఉన్నట్లు తెలుస్తుంది… వరంగల్ తూర్పు నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు టికెట్ ఖాయం ఐయితే తూర్పు నుంచి బిసి సామాజిక వర్గం నుంచి తనకు టికెట్ ఖాయమనే ధీమాలో కోరబోయిన ఉన్నట్లు తెలిసింది….. ఎర్రబెల్లి ప్రదీప్ రావు కు టికెట్ వస్తే కనుక కోరబోయినకు అధిష్టానం పశ్చిమ నుంచి టికెట్ ఖరారు చేయడం ఖాయమని ఆయన అనుచరులు ఈ ఈక్వేషన్ ను వినిపిస్తున్నారు… పక్క పక్క నియోజకవర్గాల్లో రెండు టికెట్ లు ఉన్నత సామాజిక వర్గాలకే పార్టీ కేటాయించిందని వారు భావిస్తున్నారు… ఈ కోణంలో ఆలోచన చేస్తే తమవాడికి టికెట్ చాలా ఈజీ అని వారు అంటున్నారు… మొత్తానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం కోరబోయిన సాంబయ్య బాగానే శ్రమిస్తున్నట్లు తెలుస్తుంది.

నియజకవర్గంలోని వివిధ డివిజన్ లల్లో పార్టీ ని ముందుకు తీసుకువెళుతు అన్ని చోట్లా తన అనుచరులతో ప్రజలకు దగ్గర కావడం కోసం ప్రయత్నాలు ఆరంబించినట్లు సమాచారం… గతంలో తనకు ఉన్న పరిచయాలు, ఓటు బ్యాంకు ను కాపాడుకోవడానికి క్షేత్ర స్థాయిలో వ్యూహాలు రచిస్తు తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తున్నట్లు సమాచారం… మరి కోరబోయిన సాంబయ్య విషయంలో కమలం పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో ఏదైనా మార్పుకు శ్రీకారం చుడుతుందా…?కోరబోయిన తెలంగాణ ఉద్యమ అనుభవం, పశ్చిమలో విస్తృత పరిచయాలను ఉపయోగించుకొని వరంగల్ పశ్చిమలో గెలిచి పాగా వేయాలని చూస్తుందా వేచి చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here