చిట్ ఫండ్ వెనక ఎమ్మెల్యే

వరంగల్ ఉమ్మడిజిల్లాలో చిట్ ఫండ్ ల ఆగడాలకు ఇప్పటివరకు ఎలాంటి పులిస్టాప్ పడలేదు … ఇటీవల ఈ చిట్ ఫండ్ ల ఆగడాలకు చెక్ పెట్టాలని పోలీసులు ప్రయత్నాలు వారు కొంతమేరకు మాత్రమే చేయగలిగారు. ఎక్కడ ఏ చిట్ ఫండ్ ను చూసిన ఎక్కడో ఓ దగ్గర రాజకీయ మూలాల ఉండడంతో చర్యలు తీసుకోవడం కష్టంగా మారిందనే విమర్శలు వినబడుతున్నాయి… రాజకీయ నాయకుల మూలంగా కొన్ని చిట్ ఫండ్ లు దర్జాగా తమ దందాను కొనసాగిస్తూ ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా ఏమవుతుంది లే అనే నిర్లక్ష్య ధోరణీలో ఉన్నట్లు తెలుస్తుంది.

చిట్ ఫండ్ వెనక ఎమ్మెల్యే- news10.app

చిట్ ఫండ్ వెనుక ఎమ్మెల్యే….?

చిట్ కాల పరిమితి ముగిసిన ఖాతాదారులకు డబ్బులు చెలించకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చిట్ డబ్బులకు, ప్లాట్ ధరకు అసలు పొంతన లేకుండా అగ్గువ సగ్గువ ప్లాట్ ఎక్కవమొత్తం డబ్బులు తీసుకుని కట్టబెట్టి చెల్లుకు చెల్లు అని “శుభం” పలకాలని చూస్తున్న ఆ చిట్ ఫండ్ వెనకాల ఓ ఎమ్మెల్యే ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది… అందుకే ఆ చిట్ ఫండ్ యాజమాన్యం తమను ఎవరు ఏమి చేయరనే ధీమాతో ఖాతాదారుల నెత్తిన శఠగోపం పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది.

నగర శివారు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా కొనసాగుతూ నగరంలోని కొన్ని ప్రాంతాలు కూడా తన నియోజకవర్గంలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఆ చిట్ ఫండ్ లో ఎప్పుడో తన వాటాలు పెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది…. తన నియోజకవర్గంలోని కొంతమంది ఆ చిట్ ఫండ్ లో చిట్ వేసి డబ్బులు రాక ఇప్పటికి ఆ చిట్ ఫండ్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగెల తిరిగిన నయా పైసా కూడా చెల్లించకుండా విలువ లేని ప్లాట్లను అంటగట్టాలని చూస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే అండతోనే ఆ చిట్ ఫండ్ యాజమాన్యం ఖాతాదారులకు ఏమాత్రం డబ్బులు చెల్లించకుండా రేపు మాపు అంటూ కార్యలయం చుట్టూ తిప్పుకొని శుభం కార్డు వేసి రియల్ రంగంలో దండుకోవాలని చూస్తున్నట్లు సమాచారం… కాగా ఈ చిట్ ఫండ్ భాదితులు కొంతమంది యాజమాన్యం తమకు డబ్బులు చెల్లించడం లేదని ఓ మంత్రికి పిర్యాదు చేసినట్లు సమాచారం… దింతో ఆ మంత్రి కలుగజేసుకొని ఖాతాదారుల డబ్బులు చెల్లించాలని యాజమాన్యానికి స్వయంగా చెప్పిన ఫలితం లేకుండా పోయిందట.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ చిట్ ఫండ్ లో వాటాలు కలిగి ఉన్నాడని తెలిసిన ఆ మంత్రి ఎమ్మెల్యేకు సైతం ఫోన్ చేసి చెప్పిన ఎలాంటి చెల్లింపులు మాత్రం జరగలేదని విశ్వసనీయ సమాచారం… ఇది ఇలావుంటే చిట్ డబ్బులు ఖాతాదారులకు చెల్లించకుండా ముప్పుతిప్పలు తిప్పలు పెడుతున్న చిట్ ఫండ్ యాజమాన్యం చిట్ డబ్బులు అన్నింటిని రియలేస్టేట్ లో పెట్టుబడిగా పెట్టి వెంచర్ లు వేస్తూ దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది… ఈ రియలేస్టేట్ దందాను ఆ ఎమ్మెల్యే కుమారుడు చూసుకుంటున్నట్లు తెలిసింది… తన తండ్రి పదవిని అడ్డుగా పెట్టుకొని ఎమ్మెల్యే పుత్ర రత్నం రియల్ రంగంలో బాగానే దూసుకువెళుతు నగరంలోని, నగర శివారులోని భూములన్ని అగ్గువ సగ్గువ కు కొనుగోలు చేసి అధికారుల సాయంతో సక్రమ భూములుగా మార్చుకుని వెంచర్ ల పేరుతో బాగానే వెనుకేస్తున్నారని ప్రచారం జరుగుతోంది… చిట్ ఫండ్ పేరుపైనే వెంచర్ లను కొనసాగిస్తూ ఖాతాదారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్ని ఇంటలిజెన్స్ ఇప్పటికే గులాబీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయిన తనకేం కాదనే ధీమాలో ఆ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలిసింది… ఎవరి దందాలు ఎలా ఉన్నా బినామిలతో దందాలు బాగానే చేస్తూ పెద్దమొత్తంలో డబ్బులు వెనకేస్తున్న అసలు చిట్ వేసి డబ్బులు రాక నానా అవస్థలు పడుతున్న వారి బాధలు ఎవరు తీరుస్తారో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది… ప్రజాప్రతినిదిగా కొనసాగుతూ జనం సొమ్ము తో రియల్ దందాలు ఏంటో సదరు ఎమ్మెల్యే కే తెలియాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here