శభాష్ పోలీస్

ఖాకీల సాహసం…

తగాలబడుతున్న పశువుల కొట్టం వద్ద ఉన్న మూగ జీవాలను కాపాడి ఆ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. మంటలను సైతం లెక్కచేయకుండా పశువులను కాపాడే సాహసం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లారామన్నపేట మండలం ఇస్కిళ్ళ గ్రామ శివారులో దగ్ధం అవుతున్న పశువుల కొట్టం వద్ద అల్లాడుతున్న మూగజీవాలను కాపాడి రామన్నపేట పోలీసులు శభాష్ అనిపించుకున్నారు.

విధినిర్వహణలో భాగంగా వెళ్లి తిరిగి వస్తుండగా ఇస్కిల్ల గ్రామ శివారులో తగలబడుతున్న పశువుల కొట్టాన్ని చూసి చలించిపోయారు. కక్కిరేణి నుండి రామన్నపేట కు వస్తున్న కానిస్టేబుల్ పంజాల యాదగిరి, కోమటి రెడ్డి రవీందర్ రెడ్డి లు సాహసాన్ని ప్రదర్శించి మంటలకు అల్లాడి పోతున్న మూగజీవాలను కాపాడారు. ప్రాణాలకు తెగించి కొట్టం లోని మూగ జీవాలను బయటకు తీసుకు వచ్చారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి పశువులను కాపాడిన కానిస్టేబుళ్లను స్థానిక గ్రామ ప్రజలు అభినందించారు.