సాయం అందించిన మహిళా పోలీస్ అధికారి

ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్లో భాగంగా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కాజీపేట మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొట్టె పద్మ తాను పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా కాజీపేట జూబ్లీ మార్కెట్ లోని కొంతమంది మహిళలు తమకు లాక్ డౌన్ తో ఉపాధి పోయిందని ఆకలితో బాధపడుతున్నాము అని తెలపగా తాను అమ్మగా మారి 10 కుటుంబాలకు ఈ రోజు తన జీతం నుండి 5 వేల రూపాయల ఆర్థిక సహాయంతో వారికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. తనలోని అమ్మతనాన్ని చాటుకొని ఆకలితో బాధపడుతున్న వారికి ఆకలి తీర్చడానికి ప్రయత్నించిన కాజీపేట మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొట్టే పద్మని స్థానికులు మరియు పోలీసు అధికారులు అభినందించారు.