బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం ఇక నేరం

రోడ్లు, సంస్థలు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘ప్రస్తుతం కోవిడ్ 19 మహమ్మారి ప్రబలుతోంది. ఈ సమయంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి. అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలి. వాటి వల్ల వైరస్, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం వల్ల ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలే ప్రమాదం ఉంది. ప్రజారోగ్యం భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్ , లేదా ఉమ్మి ఊయటం, గుట్కా నమిలి ఉమ్మటం, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మటాన్ని నిషేధిస్తున్నాం.’ అని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here