చదివింది బిఎఎంఎస్ చేసేది సర్జరీలు…..

పేరుకే ఆయన బిఎఎంఎస్ డాక్టర్ కానీ పలు ఆసుపత్రుల్లో పెద్ద డాక్టర్ గా చెలామణి అవుతూ సర్జరీలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. పలు ఆస్పత్రుల్లో తానే పెద్దడాక్టర్ గా వ్యవహరిస్తూ అర్హత ఉన్న డాక్టర్ కన్న ఎక్కువగా సర్జరీలు చేస్తున్నాడని తెలిసింది. కొందరు డాక్టర్ లు కూడా ఆసుపత్రుల్లో ఇతగాడికి ప్రాధాన్యత ఇస్తూ సర్జరీలు చేయిస్తున్నట్లు తెలిసింది. ఆయన మాత్రం
చదివింది బిఎఎంఎస్… చేసేదేమో ఆర్థో పెడిక్ సర్జరీలు అర్హతలేకున్నా ధనార్జనే ధ్యేయంగా రోజు మూడు నుండి నాలుగు హాస్పిటల్స్ లో సర్జరీలు చేస్తూ ఆయనే ఆర్థోపెడిక్ సర్జన్ గా హన్మకొండ, ఓరుగల్లు లో చెలామణీ అవుతున్నాడట ….

చదివింది బిఎఎంఎస్ చేసేది సర్జరీలు.....- news10.app

నేనే సర్జన్….

బిఎఎంఎస్ చదివిన ఈ డాక్టర్ సాబ్ తన గురించి తాను సన్నిహితుల వద్ద గొప్పలు చెప్పుకుంటున్నాడట. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకున్నా సర్జరీ చేస్తున్న సదరు డాక్టర్ తనకు డబ్బులు లేక బిఎఎంఎస్ చదివాను కానీ డబ్బులు ఉంటే ఆర్థోపెడిక్ చదివి అధికారికంగా సర్జరీలు చేసేవాన్ని అని గొప్పలు చెప్పుకుంటున్నాడట ఇంతటితో ఆగకుండా ప్రస్తుతం ఉన్న ఆర్థో సర్జన్ లలో చాలామంది డాక్టర్ లకు సర్జరీలు చేయడం రాదని కాబట్టే నన్ను ఆశ్రయించి నాతో వారి వారి ఆసుపత్రుల్లో సర్జరీలు చేపిస్తారని దానికి పరిహారంగా సర్జరీకి నాకు రెండు వేలు ఇస్తారని , వారు సర్టిఫికేట్ పరంగా మాత్రమే ఆర్థోసర్జన్ లని నేనే నిజమైన ఆర్థో సర్జన్ అని, ఆ టాలెంట్ నాకు దేవుడు ఇచ్చిన వరం అని ఆయనే నిజమైన ఆర్థోపెడిక్ డాక్టర్ గా చెప్పుకుంటున్నాడట.

సర్జరీలు ఫెయిల్

బిఎఎంఎస్ చదివి సర్జరీలు చేస్తున్న ఈ నకిలీ ఆర్థో సర్జన్ సర్జరీ చేసిన పేషంట్ లలో దాదాపు 10 నుండి 15 మంది సర్జరీలు ఫెయిల్ అయ్యాయట దీంతో చేసేదేమిలేక కొంతమందిని డబ్బులతో ,మరికొంతమందిని ఫీజు లేకుండానే ఇంటికి పంపారట హాస్పిటల్ యాజమాన్యం. అంబాలకు చెందిన ఓ వ్యక్తికి ఓ కాలుకు సర్జరీ చేయబోయి మరోకాలుకు ఆపరేషన్ చేశాడట తీరా బంధువులు నిలదీస్తే చేసేదేమిలేక అసలు కాలుకు సర్జరీ చేసి ఫీజు తీసుకోకుండానే ఇంటికి పంపించారట. హన్మకొండ కాకాజీ కాలనీ లో ప్రముఖ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో పని చేస్తున్న ఈ బిఎఎంఎస్ డాక్టర్ వ్యవహారం ఐ ఎం ఏ కి, ఆర్థోపెడిక్ డాక్టర్ లందరికి తెలిసిన కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
డిఎంహెచ్ఓ కలుగజేసుకొని అర్హత లేకున్నా పలు ఆసుపత్రుల్లో ఆపరేషన్ లు చేస్తున్న ఈ బిఎఎంఎస్ (నకిలీ ఆర్థోపెడిక్ డాక్టర్) పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంటున్నారు. ఇక ముందు ఎవరు కూడా అర్హత లేకుండా వైద్యం చేస్తే ఆరోగ్యశాఖ అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటారనే హెచ్చరిక జారీ చేయాలని రోగుల బంధువులు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here