అనుమానాస్పదంగా ఒకరి మృతి

గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం కు తరలింపు

గణపురం మండలంలోని లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో టోగరి కుమారస్వామి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి వెంకటాపురం మండలం కేశవ పురం గ్రామానికి చెందన చౌదరి టోగర కుమారస్వామి ఆయన భార్య సరిత లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో రూమ్ కిరాయి బుధవారం తీసుకున్నారు ఇదే రోజు రాత్రి భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో దీంతో భార్య సరిత ఆమె తల్లి గారి ఇల్లు కొత్త పల్లి కి వెళ్ళింది గురువారం తెల్లవారేసరికి కుమార్ స్వామి ఇంటి ముందు చనిపోయి ఉన్నాడు దీంతో రూమ్ ఓనర్ ఆదిరెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిమిత్తం పరకాల ఆస్పత్రికి తరలించారు తరలించారు.