అధికారులు కదలరు…కబ్జా ఆగదు

ములుగురోడ్డు కె ఎస్ ఆర్ గార్డెన్ వెనుకాల ఉన్న నిమ్మాయచెరువు కబ్జా ము గురవుతున్న దానిని కాపాడడానికి అధికారులు అడుగు కూడా ముందుకు కదలడం లేదు.. రాత్రిపూట కబ్జారాయుళ్లు పెద్ద పెద్ద బండరాళ్లు ,మట్టితో చెరువును పూడ్చివేస్తున్న అడ్డుకోవడానికి అధికారుల అడుగులు అటువైపుగా ఏమాత్రం కదలకపోవడం విమర్శలకు దారితీస్తుంది. చెరువును పూడ్చి కబ్జా కు ప్రయత్నిస్తున్న కబ్జారాయుళ్లు కబ్జా పర్వం యథేచ్ఛగా కొనసాగుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అధికారులు కదలరు...కబ్జా ఆగదు- news10.app

కలెక్టర్ కు విన్నవించుకున్న…

నిమ్మాయచేరువు కబ్జా కు కొందరు కబ్జారాయుళ్లు ప్రయత్నం చేస్తున్నారని,కబ్జాను అడ్డుకోవాలని ఈ చెరువు పై ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులు కలెక్టర్ కు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయింది. రైతులు స్వయంగా వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదు చేసిన చర్యలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి.అధికారులె వరు చెరువును కాపాడేందుకు చర్యలు తీసుకొకపోవడంతో కబ్జారాయుళ్లు తమ కబ్జా పనిని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు…బుధవారం రాత్రి,గురువారం తెల్లవారుజామున సైతం టిప్పర్లతో బండరాళ్లు,మట్టిని తరలించి చెరువును పూడ్చివేస్తున్నారు.

కబ్జారాయుళ్ల వెనుక ఎవరు…?

ఓ వైపు అధికారులు కదలకపోవడం కబ్జాను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం,మరోవైపు కబ్జారాయుళ్లు బరితెగించి చెరువును పూడ్చివేసే పనిని కొనసాగించడం చూస్తోంటే దీనివెనకాల కొంతమంది పెద్దల హస్తం ఉందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో కబ్జారాయుళ్లు పెట్రేగిపోతూ యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.వెయ్యి ఎకరాల పంటకు ప్రస్తుతం ఆదారంగ ఉన్న చెరువును పూడ్చి వేస్తున్న అధికారులు అడుగుమాత్రం కదలకపోవడంతో రైతుల అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి.ఇకనైనా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి ముందుకు కదులుతారా… లేక ఏవో సాకులు చెప్పి తప్పుకుంటారా చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here