అంతా ఆ డాక్టర్ సాబ్ ఇష్టం…?

హన్మకొండ విజయటాకీస్ రోడ్ లో తన ఆసుపత్రి ముందు అదనపు నిర్మాణం చేస్తున్న ఓ డాక్టర్ సాబ్ అంతా తన ఇష్టమే అన్నట్లు వ్యవహారిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా భవన నిర్మాణం చేస్తూ దానికితోడు ఎలాంటి అనుమతి లేకుండా మూడో అంతస్తు నిర్మిస్తూ తనకు అందరితో పరిచయాలు ఉన్నాయి వాటితో మొత్తం మ్యానేజ్ చేస్తానని ధీమా ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. చేసేదే అక్రమనిర్మాణం అది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అలాంటి నిర్మాణానికి కొంతమంది ప్రజాప్రతినిధులు ఎలాంటి అనుమతిలేకున్న తనను నిర్మాణం చేసుకోమన్నారని అందుకే అధికారులు సైతం ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదని డాక్టర్ సాబ్ బాగానే ప్రచారం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.మీడియాలో సైతం తనకు బాగానే పరిచయాలు ఉన్నాయని వార్తలు రాకుండా ఆపగలనని సదరు డాక్టర్ ఎక్కడలేని ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది…ఎవరెన్ని వార్తలు రాసిన తన నిర్మాణం ఆగదంటున్న డాక్టర్ సాబ్ అక్రమనిర్మాణాన్ని ఇంకా దర్జాగా నిర్మిస్తూ టౌన్ ప్లానింగ్ అధికారులకు సవాల్ విసురుతున్న వారు మాత్రం అక్రమనిర్మాణం అని తెలిసినా ఇప్పటికి అటువైపు కన్నెత్తి చూడలేదు సరికదా నిర్మాణ పనులు జరుగుతున్న ఇంకా మౌనాన్ని వీడటం లేదు.

అంతా ఆ డాక్టర్ సాబ్ ఇష్టం...?- news10.app

ఇదెక్కడి న్యాయం….?

చిన్న చిన్న ఇంటినిర్మాణాలు చేసుకుంటే ఏమాత్రం కొద్ధి తప్పిదం ఉన్న నిర్మాణం కూల్చేదాక వెంటబడే టౌన్ ప్లానింగ్ అధికారులు డాక్టర్ సాబ్ పరిచయాలు చూసి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది… పెద్దస్థాయిలో పరిచయాలు రాజకీయనాయకులతో దోస్తాన ఉండడం వల్ల టౌన్ ప్లానింగ్ అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దింతో సామాన్యులకు ఒక న్యాయం ప్రముఖలకు ఒక న్యాయమా అంటూ విమర్శలు బాగానే వినవస్తున్నాయి.కాగా ఆసుపత్రి అక్రమ అదనపు నిర్మాణం గూర్చి వివరణ కోసం టౌన్ ప్లానింగ్ అధికారులకు వివరణ కోసం ఫోన్ చేస్తే అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి అందుబాటులోకి రాలేదు.

అధికారులు కదిలేనా….?

హన్మకొండ విజయ టాకీస్ రోడ్ లో ఆసుపత్రి ముందు అక్రమంగా అదనపు నిర్మాణం కొనసాగుతుండగా దీనిపై చర్యలు తీసుకోవడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు కదులుతారా…లేదా..? అనేది ప్రస్తుతం ప్రశ్నఅర్ధకంగా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here