మద్యం ప్రియుల జేబుకు ఖాకీ చిల్లు…?

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని తెలుసు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుసు…. అయినప్పటికి మద్యం సేవించి వాహనాలు నడపడం మాత్రం మానుకోవడం లేదు కొంతమంది. నగర పరిధిలో మద్యం తాగి వాహనం నడపడం మద్యం ప్రియులకు బాగానే అలవాటుగా మారింది… అందుకే రహదారులపై డ్రంకన్ డ్రైవ్ పెడితే చాలు వందలకొద్ది మద్యం ప్రియులు బ్రీత్ అనలైజర్ మిషన్ కు దొరికి పోతున్నారు… ఇదంతా బాగానే ఉన్నా ఇలా మద్యం తాగి పట్టుబడ్డ వారి వల్ల వరంగల్ నగర పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కోర్టు కానిస్టేబుల్ పట్టుబడ్డ వారిదగ్గర తన చేతివాటం ప్రదర్శిస్తూ తెగ డబ్బులు లాగేస్తున్నాడట… ఇతగాడి వసూళ్ల దందాకు మద్యం ప్రియులు లబోదిబోమంటున్నారట.

మద్యం ప్రియుల జేబుకు ఖాకీ చిల్లు...?- news10.app

వివరాల్లోకి వెళితే గత రెండు సంవత్సరాల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వందల్లో ఉంటే… ప్రస్తుత సంవత్సరం కేవలం 3 నెలల్లో దాదాపు రెండు వేల కేసులు నమోదు చేసి వరంగల్ ట్రాఫిక్ పోలీసులు రికార్డు సాధించారు. అలాగే న్యాయస్థానం విధించిన జరిమానాలు కూడా 8లక్షల 63వేల 700 రూపాయలు సంవత్సర కాలంలో ఉంటే ప్రస్తుతం 3 నెలలకు గాను 17 లక్షల25 వేల 500 రూపాయలు జరిమానా కింద వసూలు చేసినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ నరేష్ కుమార్ ఇటీవల వెల్లడించారు.

ఇక అసలు విషయానికొస్తే గత మూడు నెలల నుండి ప్రతి రోజు దాదాపు 25 వేల రూపాయల నుండి 60 వేల వరకు న్యాయస్థానం జరిమానా విదిస్తుండగా.. డ్రంకన్ డ్రైవ్ జరిమానాలు వల్ల ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తుంది. కోర్టు మద్యం ప్రియులకు విధించే జరిమానా విషయం పక్కనపెడితే… దీనిని ఆసరాగా చేసుకుని క్రింది స్థాయి సిబ్బంది మాత్రం లక్షల్లో సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. వీరిలో ఓ కోర్టు కానిస్టేబుల్ మద్యం ప్రియుల వద్ద నుంచి కోర్టు విదించే జరిమానా పోను ప్రతిరోజు బాగానే వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వచ్చే వారు ప్రతి రోజు 30 మంది వరకు ఉంటున్నారు వారిని న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టటం కోర్టు కానిస్టేబుల్ పని. న్యాయ మూర్తి విచారణ అనంతరం మద్యం సేవించిన వ్యక్తికి జరిమానా విధిస్తారు. కథ ఇక్కడితో ముగిసిన కోర్టు కానిస్టేబుల్ మాత్రం సదరు వ్యక్తి ని భయబ్రాంతులకు గురిచేసి విధించిన జరిమానా కంటే అధిక మొత్తం వసూలు చేయడం కానిస్టేబుల్ వంతు అవుతుందని భాదితులు చెపుతున్నారు. రూల్ ప్రకారం ఇంత జరిమానా విధించినట్టు తెలిపే రిసిప్ట్ కూడా ఇవ్వకపోగా…. విధించిన జరిమానా తో పాటు అధికంగా కోర్టు కానిస్టేబుల్ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం సేవించి పట్టుబడ్డ వారికి రీడింగ్ ఇంత వచ్చినట్టు ఒక చీటి పై రాసి ఇస్తారు…. అది న్యాయస్థానం వారికి సమర్పిస్తే అందుకు తగ్గట్టుగా జరిమానా విధించి వాహణదారులకు రిసిప్ట్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది… కానీ దానిని కోర్టు కానిస్టేబుల్ తప్పుదోవ పట్టించి కోర్టు చెల్లించమని చూపిన జరిమానా మొత్తాన్ని చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తూ వాహణదారుల వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటునట్లు వాహనదారులు వాపోతున్నారు… ప్రతి రోజు 30 మంది వాహనదారులకు కోర్టు విధించే జరిమానా వేలల్లో ఉండగా దానికి ఈ కానిస్టేబుల్ అదనంగా తన ఇష్టం వచ్చినట్లు కలిపి… కానిస్టేబుల్ మాత్రం నెలకు లక్షల్లో వెనుకేసుకుంటున్నట్టు తెలుస్తుంది…. అలా చేస్తూ అటు న్యాయస్థానాన్ని ఇటు ప్రభుత్వాన్ని పోలీస్ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ, అక్రమ సంపాదనకు పాల్పడుతున్న వరంగల్ ట్రాఫిక్కి సంబందించిన కోర్టు కానిస్టేబుల్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.