ఇప్పుడింతే…!

వాడి కుర్చీ వీడు గుంజి…
వీడి కుర్చీ వాడు గుంజి పదవులకై పోరాటం….!

గద్దెనెక్కి జనాన్ని మరిచి అందినకాడికి దోచుకునే ఆరాటం…!

తేనేకారే పలుకులు, ఉచితాల వాగ్దానాలు
తియ్యగా నమ్మాలి… జనం వారు తేరగా సంపాదించుకోవడానికి….!

ఇప్పుడు రాజకీయమొక వ్యాపారం
దండిగా డబ్బులుంటే కలుగునట పదవి వ్యామోహం!