సీఎం పిలుపునిచ్చిన చలనం లేదు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉంటు అవగాహన కల్పించాలని సీఎం పిలుపునిచ్చిన కొంతమంది ప్రజా ప్రతినిధుల చెవికి ఎక్కలేదు.కొందరు పర్యటనలు,ప్రజా అవాఘన పేరుతో కనీస జాగ్రత్తలు పాటించకుండా అతి చేస్తుంటే ఇంకొందరు ప్రజాప్రతినిధులు ఇంటికే పరిమితం అయి తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.గ్రేటర్ వరంగల్ పరిధిలో కొందరు ప్రజాప్రతినిధులు అసలు ప్రజలతో తమకేం సంబంధం లేనట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.గ్రేటర్ పరిధిలోని కొందరు కార్పొరేటర్లు గడప దాటి తమ తమ డివిజన్లు పర్యటించడానికి సుముఖత చూపడం లేదు.

చీటికీ మాటికి ఫోటో లకు ఫోజులు ఇచ్చే ఈ నాయకులు ప్రజల గూర్చి పట్టించుకోవడమే ప్రస్తుతం మానేశారట.కష్ట కాలంలో మనవాళ్ళు ఎవరో, పరాయి వారు ఎవరో తెలుస్తుంది అంటారు.కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేటి తరుణంలో రాజకీయ నాయకులు ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.కొద్ది మంది రాజకీయ నాయకులు మినహా చాలా మంది ప్రజా ప్రతినిధులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.ఫోటోలకు,పబ్లిసిటీ వంటి కార్యక్రమాలకు చురుకుగా పాల్గొని నాయకులు కరోనా వైరస్ నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత లేదా.యధా రాజ తధా ప్రజా అన్నట్లు ప్రజలు రోడ్లపైకి రావడం,సామాజిక దూరాన్ని పాటించక పోవడం వంటి అవగాహన లేని పనులను చేస్తున్నారు.

నాయకుడు అంటే పోరాటాలకు ముందు ఉండి తన వెనక ప్రజలను నడిపించేవాడు. కానీ మన నాయకులు దండలకు ముందు దండన కు వెనక అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయడానికి అధికారుల పాత్ర చాలా ముఖ్యం.అధికారులకు ఎదురయ్యే సమస్యలను ప్రజాప్రతినిధులు నిరంతర పర్యవేక్షణలో పరిష్కరించవచ్చు. కానీ వరంగల్ నగరంలో ని చాలామంది కార్పొరేటర్లు ఇలా ఇళ్లకే పరిమితం అవుతున్నారు.కొద్ది మంది కార్పొరేటర్లు మాత్రమే చురుకుగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు..ఇప్పటికైనా ఇంటికే పరిమితం అయిన కొంతమంది కార్పొరేటర్లు ప్రజాక్షేత్రంలో కి వెళ్లి ప్రజలకు కరోనా వైరస్ నివారణ కు సరైన సలహాలు,సూచనలు ఇస్తూ అధికారులను ,క్రిందిస్తాయి ఉద్యోగులను ప్రోత్సహిస్తూ నిరంతర పర్యవేక్షణలో కరోనా వైరస్ కట్టడికి కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.