డ్రోన్ స్ప్రే ను ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి

మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరులో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు శ‌నివారం డ్రోన్ స్ప్రేను ప్రారంభించారు. డ్రోన్ సాయంతో పై నుంచి నేరుగా సోడియం హైపో క్లోరైడ్ ని స్ప్రే చేస్తారు. ఈ విధంగా స్ప్రే చేయ‌డం ద్వారా క‌రోనా వైర‌స్ నిర్మూల‌న జ‌రుగుతుంది. క‌రోనా వైర‌స్ ని స‌మూలంగా నాశ‌నం చేసే దిశ‌గా ఈ డ్రోన్ స్ప్రేయ‌ర్ ని వాడుతున్నారు. క‌రోనా వైర‌స్ పై ముప్పుటా దాడి చేయ‌డానికి ఈ డ్రోన్ స్ప్రే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. మంత్రి స్వ‌యంగా డ్రోన్ ని ఆప‌రేట్ చేశారు. ఇప్ప‌టికే ఈ డ్రోన్ స్ప్రేని వ‌రంగ‌ల్,న‌ర్సంపేట త‌దిత‌ర ప్రాంతాల్లో వినియోగించారు.

డ్రోన్ స్ప్రే ను ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి- news10.app

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తొర్రూరులో మొద‌టిసారిగా వినియోగిస్తున్నారు. త‌ద‌నంత‌రం ఈ డ్రోన్ స్ప్రేని అన్నిప‌ట్ట‌ణాలు, మండ‌ల కేంద్రాలు, గ్రామాల్లోనూ వినియోగిస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here