లైట్లు ఆర్పెస్తే ఏం కాదు

ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపివేయడం వల్ల తెలంగాణ పవర్ గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం పడదని తెలంగాణ ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్ రావు అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రిడ్ కు ఎలాంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని, లైట్లు ఆపివేస్తే గ్రిడ్ కుప్పకూలుతుంది అంటూ జరుగుతున్న ప్రచారం లో వాస్తవం లేదన్నారు.

తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితంగా ఉందని. ఇంజనిర్స్ అందరూ వారి జాగ్రత్త లో వారు ఉన్నారన్నారు.ఇప్పటికే జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామని,. కరోన కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చే యాలని. ప్రజలు అందరు లాక్ డౌన్లో పాల్గొని కరోన వ్యాధి వ్యాప్తిని అరికట్టలని.అప్పుడే కరోన పై మన విజయం సాధిస్తామని అన్నారు.