ఇది రాజకీయ నీతి…!

మెతుకులు చల్లి ముద్దలు మింగుతారు…
ప్రజాసంక్షేమమని పేరు పెడతారు

ఉచితాల పేరుతో ఊ దరగొడతారు…!
మాటలు బాగా చెప్పి ఓట్లు దండుకుంటారు…..!

ఈతాకు ఇచ్చి తాటాకు దొబ్బుతారు!
సంపదను పెంచుకొని విర్రవీగుతారు..!

పైసలుంటే చాలు పవర్ ఖాయమనుకుంటారు…!

ఇదే నేటి రాజకీయ నీతి… ఏ మాత్రం భయం లేని నేతల రీతి