బార్ల సంగతేంది….?

హన్మకొండ నగరంలో యథేచ్ఛగా విచ్చలవిడిగా తెల్లవారుజామునే అమ్మకాలు ప్రారంభిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ల పై చర్యలు తీసుకోవడానికి ఎక్సయిజ్ అధికారులకు ఏమాత్రం మనసు రావడం లేదు… నగరంలోని కొన్ని బార్లను ఉదయం ఐదు గంటలకే తెరిచి అడ్డా కూలీలు సామాన్యులే టార్గెట్ గా విక్రయాలు కొనసాగిస్తున్న ఎక్సయిజ్ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. వీరి విచ్చలవిడి అమ్మకాల బరితెగింపు కళ్ళకు కనపడుతున్న అధికారులు ఏమాత్రం చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.ఉదయం పది గంటలకు తెరవాల్సిన బార్ షాప్ లను తెల్లవారు జామున ఐదు గంటలకు తెరిచి అమ్మకాలు కొనసాగిస్తున్న ఎక్సయిజ్ అధికారులకు ఏమాత్రం కానరావడం లేదు.

బార్ల సంగతేంది....?- news10.app

అనుమతి ఇస్తుందేవరో….?

హన్మకొండ నగరంలోని బార్ షాప్ యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యాంగ తెల్లవారు జామున అమ్మకాలు ప్రారంభించడం వెనుక కొందరు ఎక్సయిజ్ అధికారుల హస్తం ఉన్నట్లు సమాచారం…బార్ యాజమానులు నెల వారిగా ప్రసన్నం చేసుకుని కావాల్సింది సమర్పించడం మూలంగానే బార్ షాప్ లు ఎప్పుడు తెరిచిన,ఎప్పుడు మూసిన చూసిచూడనట్లు వ్యవరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి….ఇలా ప్రసన్నం చేసుకోవడం వల్లే అనధికార అమ్మకాలకు పరోక్షంగా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు సైతం లేకపోలేదు…నెల వారిగా అధికారులకు కావాల్సింది సమర్పిస్తున్న విషయం కొన్ని బార్ షాప్ ల యజమానులు స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తూ అధికారుల అండతోనే హన్మకొండలోని కొన్ని బార్ షాప్ ల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని తెలుస్తుంది…కేవలం టార్గెట్ పూర్తి చేయాలన్న ఆలోచనతో వేళాపాల లేకుండా బార్ షాపుల్లో అమ్మకాలు కొనసాగించేలా అధికారులు తమ ఇష్టారీతిన వ్యవరిస్తున్నట్లు తెలుస్తుంది.టార్గెట్ పూర్తి కాకుంటే ఉన్నతాధికారులు తమకు చివాట్లు పెడుతున్నారని అందుకే ఎప్పుడు అమ్మిన ఎప్పుడు బార్ ఓపెన్ చేసిన తాము పట్టించుకోవడం లేదని కొందరు ఎక్సయిజ్ అధికారులు ఆప్ ది రికార్డ్ గా మాట్లాడుతున్నారు… మరి ఇకనైనా ఈ బరితెగింపు బార్ లపై చర్యలు ఉంటాయా లేదా చూడాలి.

మా దృష్టికి రాలేదే. ..?

హన్మకొండ ఎక్సయిజ్ సిఐ రామకృష్ణ

నగరంలో ని కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు కోడి కూతకు ముందే నగరంలో మద్యం విక్రయిస్తూ నిబంధనల కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హన్మకొండ డబ్బాల వద్ద ఉన్న రామ బార్ కేయు క్రాస్ లోని అలంకార్, సప్తగిరి బార్ అండ్ రెస్టారెంట్లు పై న్యూస్ 10 జరిపిన స్టింగ్ ఆపరేషన్ ‘తెల్లవారే బార్ల’ శీర్షికన బహిర్గతం అయిన విషయం తెలిసిందే… ఉదయం ఆరు గంటలకె బార్ కు వెళ్లి న్యూస్ 10 ప్రతినిధి పోలీసుల ప్రస్తావన తీసుకువస్తే ‘పోలీసులు రారు వారికి నెల నెలా మామూళ్లు పంపిస్తున్నాం కదా’ అంటూ బార్ నిర్వాహకుడు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసింది.కథనం ప్రచురించినా ఎక్సైజ్ శాఖ లో ,బార్ నిర్వాహకుల లో ఎలాంటి చలనం లేదు ఈ రోజు కూడా పైన పేర్కొన్న బార్లు యధావిధిగా కొనసాగుతున్న సంబంధిత శాఖ అధికారి అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేరు.పరోక్షంగా వీరికి సంబంధిత శాఖ అధికారులే సహకరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి….

ఇది ఒక వైపు అయితే ఇక ఇదే వ్యవహారం పై న్యూస్ 10 ప్రతినిధి హన్మకొండ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ ను ఫోన్ లో వివరణ కోరగా అలాంటి ఏమి లేదు నా దృష్టికి రాలేదు వారికి అవసరం అయితే నోటీసులు ఇస్తాం అంటూ దాటవేత ధోరణితో సమాధానం ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా సంచలనం గా మారిన ఈ స్టింగ్ ఆపరేషన్ వారికి తెలియక పోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here