ఇప్పుడేం చేద్దాం…?

వరంగల్ జిల్లా కలెక్టరేట్ లోని కొంతమంది అధికారుల్లో గుబులు పట్టుకుంది..నిత్యం అవినీతిలో తేలియాడే ఇక్కడి కొంతమంది అధికారులు ఎలాంటి బదిలీలు లేకుండా ఇక్కడే కొనసాగుతూ ఏళ్ళు గడిచిన తమ పరపతితో అక్కడినుంచి కదలకుండా ఉంటున్న వీరు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అప్పుడే పైరవీలు మొదలు పెట్టారట …ప్రతి పనికో రేటు పిక్స్ చేసి పనికోసం వచ్చిన సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్న వీరిని ఒకే చోట తిష్ట వేసిన వీరి విధానాలను ఎవరు ప్రశ్నించకూడదట.. మా అవినీతిపై కథనాలు రాస్తారా. .అంటూ న్యూస్ 10 పై చిందులు వేస్తూ వారి ఇష్టారీతిలో తిడుతూ మండిపడుతున్నారట… వీరికి తోడు అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులందరిని సమావేశ పరిచి న్యూస్10 పై కక్ష తీర్చుకుందాం అంటూ కారాలు మిరియాలు నూరుతున్నాడట…అసలు ఈ విషయం తనకు సంబంధం లేకున్నా కావాలని అందులో తలదూర్చి న్యూస్10 తో నేను మాట్లాడా…ఇకపై మీరు ఎం చేసిన వార్త కథనాలు రాయరు అంటూ ఇప్పటికే ఆ అధికారులకు అభయం కూడా ఇచ్చాడట…సందట్లో సడే మియా లాగా దూరుతున్న ఈ అధికారి ప్రస్తుతం ఓ అప్రధాన్య శాఖలో కొనసాగుతూ కాస్త పేరున్న శాఖకు రావాలని ప్రయత్నిస్తూ ఈ అవకాశాన్ని వాడుకొని ఏదైనా మండలానికి అధికారిగా వెళ్లాలని చూస్తూ… యూనియన్ పేరు చెప్పి ఉద్యోగులందరిని పోగేసి తమను బదిలీ చేయాలంటూ ఇటీవలే కలెక్టర్ కు ఓ వినతిపత్రం సైతం ఇప్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది…రెండేళ్లు దాటిన వారందరినీ బదిలీ చేయాలని ఆ వినతిపత్రం లో కోరినట్లు సమాచారం. కలెక్టరేట్ లోని కొందరి అధికారుల్లో గుబులు అలాగే ఉన్న ఇతగాడి బిల్డప్ తో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సైతం తాము సత్యవంతులమే అంటూ పోజులు కొడుతున్నారట.

ఇప్పుడేం చేద్దాం...?- news10.app

ఉప్పందించేది ఎవరు….?

వరంగల్ కలెక్టరేట్ లోని కొంతమంది అధికారుల అవినీతి భాగోతం పై వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో న్యూస్10 కు వీరిపై ఉప్పందిస్తుంది ఎవరు…?అనే విషయం పై ఆ అధికారులు బాగానే ఆరా తీస్తున్నారట..తమకు అనుమానం వచ్చిన వారిని మీరు చెప్తున్నారా…?అంటూ గుచ్చి గుచ్చి అడుగుతూ నానా రకాల మాటలతో వేధింపులకు గురి చేస్తున్నారట…ఫోన్ లు చేస్తూ అనుమానిస్తు పరోక్షంగా వార్నింగ్ లు ఇస్తూ పనిలో పనిగా న్యూస్10 కు లేనివి ఆపాదిస్తూ బూతు పురాణం అందుకుంటున్నారట…ఇలాంటి అధికారుల భాగోతం న్యూస్10 త్వరలోనే బయటపెట్టబోతుంది…కులం పేరుతో సంఘాల ముసుగులో తాము ఏంచేసిన చెల్లుతుందని ఇతరులపై బురద జల్లే వీరి బండారం త్వరలోనే బయటపెడతాం…అవినీతి బయట పడుతున్న తమకేం కాదని ధీమా వ్యక్తంచేస్తున్న అధికారులను కాపాడుతున్న వారి గుట్టు కూడా త్వరలో రట్టు కానుంది.

కలెక్టర్ నిర్ణయం కోసం…?

ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ట వేసి అవినీతి కి ఆజ్యం పోస్తున్న కొంతమంది అధికారులను ఎప్పుడు బదిలీ చేసి వారిపై కలెక్టర్ చర్యలు తీసుకుంటారా…?అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారు.. కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కలెక్టర్ నిర్ణయం ఎలా ఉంటుందోననీ ఆసక్తిగా చూస్తున్నారు….ఇంత జరుగుతున్నా కలెక్టర్ చూసి చూడనట్లు వ్యవహరిస్తారా…లేక తప్పక చర్యలు తీసుకుంటారా…?వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here