ఐటి అధికారులు స్పందించేనా…..?

తన చేతివాటంతో దండిగా ఆస్తులు సంపాదించి తనకెంకాదని తన సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తంచేస్తున్న ఆ సివిల్ సప్లై అధికారి పైకి ధీమాగా ఉన్న లోలోపల ఎం జరుగుతుందనే భయం పట్టుకున్నట్లు తెలుస్తుంది… కొత్తగా జిల్లా ఏర్పడ్డ దగ్గరి నుంచి అదే జిల్లాలో మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తు పాతుకుపోయిన ఆ అధికారి ఒక్కొక్కటిగా తన అవినీతి చిట్టా బయటపడుతుండడంతో గుబులు పడుతున్నట్లు తెలుస్తుంది.తన సన్నిహితులు , శ్రేయోభిలాషుల వద్దకు వెళ్లి తనకు సహకరించాలని వేడుకుంటున్నట్లు తెలుస్తుంది.అవినీతిలో పూర్తిగా కూరుకుపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అధికారి ఆస్తులను బినామీ పేర్లపై ఉంచి తనకు ఏంకాదని దైర్యంగా ఉన్నట్లు సమాచారం… ఇటీవల ఈ అధికారి ఇదే శాఖలో తనచేతివాటం ప్రదర్శించగా ఈ విషయంలో రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ మందలించడంతో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు విశ్వసనీయ సమాచారం.

ఐటి అధికారులు స్పందించేనా.....?- news10.app

న్యూస్-10 కథనాలతో అయోమయం

సివిల్ సప్లై లో జిల్లా మేనేజర్ గా పనిచేస్తున్న ఈ అధికారి ఎలా అక్రమంగా సంపాదిస్తున్నాడో ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడో బినామీల పేరు మీద ఏ భూములు ఫ్లాట్ లు కొన్నాడో అక్రమాస్తుల చిట్టా న్యూస్-10 వరుస కథనాలతో బహిర్గతం చేస్తుంటే సారు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్లు ఆ శాఖలోని ఉద్యోగుల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు ఈ కథనాలు ఎలా వస్తున్నాయి? నా అక్రమాస్తుల విషయం న్యూస్-10 కు ఎలా చేరిందో…. నని సారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట… ఏంచేయాలో తెలియక అయోమయమవుతున్నట్లు చర్చ జరుగుతోంది.

బినామీల పేరుతో అక్రమాస్తులు

సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిగిన జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఈ అధికారి అక్రమంగా సంపాదించిన డబ్బునంతా బినామీల పేరున ఉంచి ఆస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. హైదరాబాద్ కొత్తపేటలో అపార్ట్ మెంట్ లో ఓ ప్లాటు, పర్వతగిరి మండలంలో 5 ఎకరాల భూమి , యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ప్లాట్ లు, హన్మకొండ లో అపార్ట్ మెంట్ లో రెండు ప్లాట్ లు బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తను ఉండేందుకు విలాసవంతమైన భవనాన్ని కూడా హన్మకొండ లోని హంటర్ రోడ్ లో నిర్మించే పనిలో ఉన్నాడని ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. ఈ ఆస్తుల విషయంలో న్యూస్10 వెలువరించిన కథనం అక్షర సత్యమంటున్నారు… గత నాలుగైదు ఏళ్లలో సివిల్ సప్లై మేనేజర్ సారు ఆస్తులు గణనీయంగా పెరిగాయని సివిల్ సప్లై శాఖను ఉపయోగించుకొని సారు ఆదాయం బాగానే పెంచుకున్నాడని ఆరోపణలు బాగానే వస్తున్నాయి. ఉద్యోగంలో చేరకముందు మామూలు స్థితిలో ఉన్న ఈ అధికారి అతి తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తాడని ప్రచారం జోరుగా కొనసాగుతుంది.

ఐటీ అధికారులు విచారణ చేసేనా..?

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఉద్యమ చరిత్ర కలిగిన జిల్లాలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులను బినామీల పేరుతో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది… ఆదాయానికి మించి ఆస్తులను కూడబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ఈ సారుపై ఆదాయపు పన్ను అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారో లేదో అని ఆ శాఖ ఉద్యోగులే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది… మరి ఈ అధికారి ఆస్తుల విషయంలో ఐటి అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here