గ్రేటర్ వరంగల్ లో టౌన్ ప్లానింగ్ అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది…అక్రమ నిర్మాణాలపై ఎక్కడ లేని ప్రేమ చూపుతూ ఓ వైపు అక్రమనిర్మాణాలు జరుగుతున్న తమకేంపట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు జోరుగా వినవస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్న వాటిని చూసి చూడనట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు వదిలిపెట్టడం , అవసరమైతే ఆ భవన యాజమాన్యాలతో మాట్లాడి వారు ప్రసన్నం చేసుకోగానే వదిలిపెట్టడం వారికి పరిపాటిగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిజీ సెంటర్ లల్లో , ప్రధాన రహదారుల పక్కన ఎలాంటి అనుమతులు,సెట్ బ్యాక్ లు లేకుండా నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు తమకేం కనపడనట్లు కళ్ళు మూసుకున్నట్లు ప్రవర్తిస్తున్నారు. అక్రమనిర్మాణాలు కనపడిన ,అక్రమ నిర్మాణం అనేవిషయం బయటపడగానే వారే బిల్డింగ్ యజమాని వద్దకు వెళ్లి బిల్డింగ్ కూల్చకుండా ఉండాలంటే ఏం చేయాలో దానికి సంబంధించిన విరుగుడు టౌన్ ప్లానింగ్ వారే చెపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.దింతో టౌన్ ప్లానింగ్ అధికారులకు అక్రమనిర్మాణాలపై ఎక్కడలేని ప్రేమ ఉందని అర్ధమవుతుంది.
నోటీసుల సంగతి ఏంది….?
అక్రమనిర్మాణం విషయం బయటపడగానే అప్పటివరకు అక్కడో అక్రమనిర్మాణం జరుగుతున్నట్లు తమకేం తెలియనట్లు వ్యవహరించే అధికారులు…ఇది అక్రమనిర్మాణం 48 గంటల్లో అక్రమంగా నిర్మించిన భాగాన్ని తొలగించాలి లేదంటే తామే తొలగించి ఆ ఖర్చులు మీరే చెల్లించేలా చేస్తాం అంటూ భవన యజమానులకు నోటీసులు అందించే టౌన్ ప్లానింగ్ అధికారులు 48 గంటలు దాటినా నాలుగు వందల గంటలు ఐయిన ఎలాంటి చర్యలు తీసుకోరని స్పష్టం అవుతోంది… తాజాగా హన్మకొండ అదాలత్ ప్రాంతంలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన సెట్ బ్యాక్ లేకుండా, అంతర్గత రహదారులను ఆనుకొని, అనుమతి లేకుండా అదనంగా ఓ రెండు అంతస్తులతో ఓ అక్రమనిర్మాణం జరిగింది.ఈ విషయాన్ని న్యూస్10 తన వరుసకథనాల్లో వెలువరించగా ఆ బిల్డింగ్ యాజమాన్యానికి నోటీసులు అందజేసి 48 గంటల సమయం గడువు విధించారు. ఆ గడువు దాటి రోజులు గడుస్తున్న చర్యలు మాత్రం శూన్యంగా ఉన్నాయి.దింతో టౌన్ ప్లానింగ్ అధికారులు మొక్కుబడి పనులు తప్ప ఆచరణలో విఫలం అవుతున్నారని మరోసారి స్పష్టం ఐయింది.మాటలు చెప్పడం ఏది అడిగిన నోటీసులు ఇచ్చాం అని చెప్పడం టౌన్ ప్లానింగ్ అధికారులకు అలవాటుగా మారినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు మారతారా….? అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తార లేదా చూడాలి.