సృష్టిపై కమిషనర్ స్పందించేనా…?

వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్ జంక్షన్ పక్కనే ఉన్న సృష్టి ఆసుపత్రి బిల్డింగ్ మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.. ఆసుపత్రి బిల్డింగ్ చుట్టూ సెట్ బ్యాక్ లేకుండానే ఇష్టారాజ్యంగా కట్టినట్లు తెలుస్తోంది ఆసుపత్రి బిల్డింగ్ చుట్టూ నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ అవ్వాల్సి ఉన్నా అవేమి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మించుకున్నట్లు భవనాన్ని పరిశీలిస్తే ఎవరికైనా అర్థం అవుతుంది కానీ వరంగల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు మాత్రం ఇదేమి అర్థం కావడం లేదు..భవనం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారు మాత్రం చర్యలకు వెనుకాడుతున్నారు…కొన్ని వారాల క్రితం ఆసుపత్రి యాజమాన్యానికి నోటిసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది..

సృష్టిపై కమిషనర్ స్పందించేనా...?- news10.app

మీనమేషాలు లెక్కిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు

వరంగల్ నగరంలోని సృష్టి ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణంపై న్యూస్-10 వరుస కథనాలను వెలువరించగానే విచారణ పేరుతో హడావిడి చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు తర్వాత మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగిన చర్యలు తీసుకునే టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా సృష్టి ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణం జరిగినా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు…ఇందులో ఉన్న ఆంతర్యం ఎంటో ఎంతమాత్రం అర్థం కావడం లేదు …టౌన్ ప్లానింగ్ అధికారులను ఆసుపత్రి యాజమాన్యం ప్రసన్నం చేసుకోడం వల్లే టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలకు ససేమిరా అంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

కమిషనర్ స్పందించి చర్యలకు ఆదేశించేనా?

నగరంలోని పోచంమైదాన్ లో ఉన్న సృష్టి ఆసుపత్రి బిల్డింగ్ మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా పూర్తి సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన కూడా చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆసుపత్రి యాజమాన్యం తో కుమ్మక్కైనందునే చర్యలకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా వారి ఇష్టారాజ్యంగా నిర్మించుకున్న ఆసుపత్రి బిల్డింగ్ పై గ్రేటర్ వరంగల్ కమిషనర్ స్పందించి చర్యలకు ఆదేశిస్తారా లేదా అని పలువురు ఉత్కంఠగా వేచిచూస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here