స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి…కడియం పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ మాటల తూటాలు పేలుస్తున్న రాజయ్యకు అదే స్థాయిలో కడియం బదులు ఇస్తున్న వీరిద్దరి మధ్య డైలాగ్ వార్ కు మాత్రం పులిస్టాప్ పడడం లేదు…ఇద్దరూ ఇద్దరే అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాష్ట్రంలో రాజకీయ కాక పెంచుతున్నారు…మొన్నటికి మొన్న కడియం శ్రీహరి పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే రాజయ్య తాజాగా కడియం నిన్న ఓ ప్రెస్ మీట్ లో రిలీజ్ చేసిన కొన్ని ప్రొసీడింగ్స్ కాఫీలు తగలబెట్టి విమర్శలు చేసారు…శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి విడుదల చేసిన ప్రొసీడింగ్ కాపీ తగలబెట్టారు తాటికొండ రాజయ్య. కనీసం ప్రొసీడింగ్ కాపీ మీద సంతకం పెట్టడానికి కూడా ధైర్యం లేని పిరికోడు కడియం శ్రీహరి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. శ్రీ హరి నిన్న విడుదల చేసి కాగితం కేవలం చిత్తు కాగితం.. అది ప్రొసీడింగ్ కాపీ కాదు, కేవలం ప్రపోజల్ మాత్రమేనన్నారు.కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికివాడు కడియం శ్రీహరి అని ఆగ్రహించారు…ప్రజల అభీష్టం మేరకే కడియం పార్టీ మారి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జెండా పట్టుకుని తెలంగాణ మొత్తం తిరగాలని.. పూలదండలు వేస్తారో లేక చెప్పుల దండ వేస్తారో సిద్ధంగా ఉండాలని కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు ….
Former MLA Rajaiah speaks to the media



