డ్యూటీ ఆర్ ఎం ఓ హవా

కొంతమంది ప్రభుత్వ వైద్యులకు ప్రజలకు వైద్యం చేయడం కంటే పెత్తనం చేలాయించడం పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు కనపడు తుంది.. అధికారం చేలాయిస్తే విధులకు దూరంగా కార్యాలయంలో కూర్చొని బాతఖాని కొడుతూ టైం పాస్ చేయవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తుంది గతంలో అధికారిక విధుల్లో వారిని తాత్కాలీకంగా నియమించి ఆతర్వాత వారి స్థానంలో వేరే వారిని నియమించిన కుర్చీలు వదలకుండా తిష్ట వేసి ఉంటున్నారు కొందరు… కట్టబెట్టిన పదవి ఊడిపోయినా… తాము ససేమిరా పోమని అలాగే పదవి పట్టుకొని వేలాడుతున్నారు… సరిగ్గా ఇలాంటి సీన్ ఇప్పుడు వరంగల్ ఎంజియం లో కొనసాగుతుంది.. ఆ బాధ్యతలు తమరికి లేవు మహాప్రభో అని అధికారులు చెబుతున్న ఆ వైద్యుడు ఏమాత్రం వినకుండా అధికారం ఉందనే బ్రమల్లో ఎం జి ఎం సూపరింటెండెంట్ కార్యాలయంలో నే పుల్ టైమ్ తిష్ట వేసి అధికార దర్పం  ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి..

విధులకు డుమ్మా… కార్యాలయంలో తిష్ట

ఉత్తర తెలంగాణ కు పెద్దదిక్కుగా ఎంజీఎం ఆసుపత్రిని నమ్ముకొని రోజుకు వేలాదిమంది వైద్యం కోసం ఎంజీఎం ను ఆశ్రయిస్తారు.కాని వైద్యాన్ని వదిలేసి కొంతమంది ఎంజీఎం ఆసుపత్రిలో అధికారులు వ్యవహరిస్తున్న పని తీరును చూస్తే.. ఆశ్చర్యకరంగా ఉంది.. అత్యవసర విభాగంలో విధులు నిర్వహించాల్సిన సిఐఎస్ డాక్టర్లు ఎంజీఎం సుపరిండెంట్ కార్యాలయంలో నిత్యం కూర్చుని బాతాఖాని కొడుతున్నారని విమర్శలు వస్తున్నాయి…ఎంజీఎం ఆసుపత్రిలో బాధ్యతలు నిర్వహించడానికి ప్రస్తుతం ఆర్ఎంవో -1 ఆర్ఎంవో- 2 లను సర్కార్ నియమించింది… ఏ పని ఉన్న ఏ పైల్ చక్కబెట్టాలన్న వీరితో సూపరింటెండెంట్ పని చేయించవచ్చు… కాని ఎం జి ఎం లో ఇందుకు విరుద్దంగా కొనసాగుతుంది…ఇద్దరు ఆర్ ఎం ఓ లు ఉన్న ఎం జి ఎం సూపరింటెండెంట్ సి ఎం ఓ తో పనులు చక్కబేడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి… దింతో సీఎంవో తో సూపరింటెండెంట్ కు పని ఏంటి అని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు…దీనివల్ల అత్యవసర విభాగంలో విధులు నిర్వహిస్తున్న సి ఎస్ లకు అధిక పని భారం పడుతుందని చెపుతున్నప్పటికీ కూడా ఎం జి ఎం అధికారులు పట్టించుకోవడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరు రెగ్యులర్ ఆర్ఎంవోలు ఉన్న సి ఏఎస్ డ్యూటీ ఆర్ ఎంఓలు సూపరింటెండెంట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఆ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఫైల్ ను పరిశీలిస్తూ షాడో సూపరింటెండెంట్ గా చలామణి అవు వుతున్నారని ఎంజీఎం లో పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు…అత్యవసర విభాగం కి ప్రతిరోజు సుమారుగా రెండు వేలకుపైగా రోగులు ఎంజిఎం కు వైద్య నిమిత్తం వస్తారు.. వీరికి వైద్యం అందించాల్సిన సిఐఎస్ డాక్టర్లను సూపరింటెండెంట్ కార్యాలయంలో కూర్చోబెట్టి ఎందుకు విధులకు హాజరు కాకుండా చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు… ప్రజలకు వైద్యం చేయడానికి అందుబాటులో లేని సిఎస్ డాక్టర్ కు జీతం ఎందుకని కొందరు అంటున్నారు. ఎంజీఎం అధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తే ఎంజీఎం కే అవమానకరంగా ఉందని ప్రజా సంఘాలు అంటున్నారు… మరి ఎం జి ఎం వ్యవహారంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here