బస్టాండ్ లో ధరల మాయ

హన్మకొండ బస్టాండ్ లో నిర్వహిస్తున్న దుకాణాలలో ధరలపై ఏమాత్రం నియంత్రణ లేకుండా పోయింది.. టిఎస్ఆర్టిసి నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న దుకాణదారులు తమ దుకాణాల్లోని వస్తువులను తమ ఇష్టారీతిన అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి హ నుమకొండ జిల్లా బస్టాండ్ లో దుకాణదారులు ప్రయాణికుల జేబులకు అధిక ధరలతో చిల్లులు పెడుతున్నారు… ఏ వస్తువు కొనుగోలు చేసిన ఐదు నుంచి పది రూపాయలు ఎక్కువగా వసూలు చేసి దండుకుంటున్నారు.. అధిక ధరల వల్ల మోసపోతున్న ప్రయాణికులు ఇదేంటని..? ప్రశ్నిస్తే కొందరు దుకాణదారులు బెదిరింపులకు దిగుతున్నారని, కొంటె కొనండి.. లేదంటే వెళ్లిపోండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొందరు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.. ఈ దుకాణాలలో అమ్మే బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, చిప్స్ తదితర వస్తువులు ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరకు విక్రయిస్తూ దుకాణదారులు తమ ఇష్టారీతిన వ్యవ రిస్తున్నారు… దీంతో అత్యవసరంగా వస్తువులు కొనుగోలు చేయాల్సిన ప్రయాణికులు దుకాణదారులు విక్రయిస్తున్న అధిక ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు… చేసేది లేక అడిగినంత సమర్పించి వెళ్ళిపోతున్నారు.. ఇదే అదునుగా తీసుకున్న దుకాణదారులు ఎమ్మార్పీ రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తూ సర్కార్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు… టి ఎస్ ఆర్ టి సి నుంచి కాంట్రాక్టు తీసుకునే ముందు బస్టాండ్ లో ఏ వస్తువును ఎమ్మార్పీ దొరకంటే ఎక్కువ అమ్మకూడదని నిబంధన ఉన్న ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ దుకాణదారులు ఎమ్మార్పీ కంటే ఎక్కువగానే దాదాపు అన్ని వస్తువులను విక్రయిస్తున్నారు కాగా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు వస్తువులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టు రద్దు తో పాటు జరిమానా విధిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్న ఆచరణలో అది మాత్రం ఇక్కడ కానరావడం లేదు . హనుమకొండ బస్టాండ్లో బహిరంగంగానే ఆర్టీసీ సిబ్బంది ముందే దుకాణదారులు అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్న ఈ విషయం మాత్రం ఏ అధికారి దృష్టికి పోవడం లేదు దీంతో దీని వెనకాల ఉన్న మతలబు ఏంటో ఆర్టీసీ అధికారులకే తెలియాలని పలువురు ప్రయాణికులు కామెంట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎంఆర్పి ధరకే వస్తువులను విక్రయించాలని నిబంధన ఉండగా దీని నుంచి తప్పించుకునేందుకు కొందరు విక్రయదారులు వస్తువులు తయారు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకొని బహిరంగ మార్కెట్లో విక్రయించే ఎమ్మార్పీ ధర కంటే కేవలం బస్టాండ్ లో విక్రయించేందుకు అధిక ధరలను ముద్రించి ఆ వస్తువులను ఎమ్మార్పీ కంటే ఐదు రూపాయలకు తక్కువగా అమ్ముతున్నట్లు మోసం చేస్తున్నారు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న వస్తువుల ఎమ్మార్పీ ధరలకు బస్టాండ్లో విక్రయిస్తున్న వస్తువుల ఎమ్మార్పీ ధరలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు.. ఏకంగా కంపెనీలతోనే అవగాహన కుదుర్చుకొని ఎక్కువ ఎంఆర్పి ఉన్న స్టిక్కర్లు వస్తువులపై వేయించి తక్కువ ధరకు అమ్ముతున్నట్లు విక్రయిస్తూ ఇంతగా బరితెగించారంటే అధిక ధరల దందా హనుమకొండ బస్టాండ్ లో ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు బస్టాండ్లో అధిక ధరల విక్రయ దందా ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా జరుగుతున్న ఆర్టీసీ అధికారులు కళ్ళు మూసుకున్నట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారో వారికే తెలియాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here