గాలికి వచ్చినవాడిని కాదు

ఓ పత్రికలో తనపై వచ్చిన కథనం పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు… ఆ పత్రిక యజమానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు…నేను గాలికి వచ్చిన వాడిని కాదు
40 సంవత్సరాలు సభ బయట, లోపల పోరాటం చేసి వచ్చాను..ఇలాంటి నీచ, నికృష్టపు, దిగజారిపోయి రాజకీయాల కోసం ఇలాంటి కథనాలు స్ప్రెడ్ చేసే వీక్ క్యారెక్టర్ నాది కాది అంటూ భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు…తాను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం ఎలాంటి గద్దలను, దోపిడీ దారులను, “క్రిమినల్స్”‌ను తెలంగాణ ఆస్తుల మీద పడకుండా చూసుకుంటానని భట్టి విక్రమార్క అన్నారు…ఎ బి ఎన్ రాధాకృష్ణ రాసిన కట్టు కథ వెనుక ఎవరు ఉన్నారు…? ఎవరు రాయించారు…? ఏ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అనేది సాయంత్రం చెప్తానని భట్టి చెప్పారు…నా మీద అబద్ధాలు రాసిన ఎ బి ఎన్ రాధాకృష్ణకు ఎవరి మీదనో ప్రేమ ఉండొచ్చు..లేదా నేను రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడుని కాబట్టి ఆయన మీద కోపం నా మీద చూపించడానికి రాసి ఉండొచ్చు… రాధాకృష్ణ లాగా ఏది పడితే అది రాయను, ఎందుకు అంటే నాకు బాధ్యత ఉంది, నా మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి.. నైని కోల్ బ్లాక్ గనుల టెండర్లు కాన్సెల్ చేసి మళ్లీ కొత్త టెండర్లు వెయ్యండని చెప్పాను,
రాధాకృష్ణ ఒక కట్టు కథని, ఒక పిట్ట కథని అల్లి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి నామీద ఒక కథనం రాశాడని భట్టి విక్రమార్క ఆరోపించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here