ఒక్కరోజే కరోన బారిన 66 మంది

తెలంగాణలో ఒక్క రోజే 66 మంది కరోన బారిన పడ్డారు.కరోన కాస్త అదుపులోకి వస్తున్నదని అనుకుంటున్న సమయంలోనే ఇంత పెద్దమొత్తంలో కరోన బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.కరోనపై శుక్రవారం ఆరోగ్య శాఖ విడుదలచేసిన బులెటిన్ లోతెలంగాణలో కొత్తగా మరో 66 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్నటి వరకు తెలంగాణలో 700 మంది కరోనా బాధితులు ఉండగా, ఇప్పుడు మరో 66 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 766కు పెరిగింది. ఈ రోజు ఒక్కరు కూడా డిశ్చార్జ్ కాలేదు. ఎలాంటి ప్రాణనష్టం కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డేటాను పరిశీలిస్తే ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 286 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 44 కేసులు ఉన్నాయి. నిజామాబాద్ 42, వికారాబాద్ 33 కేసులతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం 562 యాక్టివ్ కేసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.