జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ

భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని జర్నలిస్టులకు కాకతీయ ప్రెస్ క్లబ్లో సాయి రత్న హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన సుమారు 95 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను హాస్పిటల్ యాజమాన్యం పంపిణీ చేసింది. డాక్టర్ స్నిగ్ధ సంస్కృతి కళ్యాణ్ చక్రవర్తి లు నిత్యావసర వస్తువులను జర్నలిస్టులకుఅందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాయి రత్న హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ స్నిగ్ద సంస్కృతి మరియు కళ్యాణ్ చక్రవర్తి లు మాట్లాడుతూ కరోన మహమ్మారి నిర్ములనకై డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తో పాటు జర్నలిస్టులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే మా వంతు సాయంగా నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మా వంతుగా జర్నలిస్టులకు సహాయక సహకారం అందిస్తామని తెలిపారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సాయి రత్న యాజమాన్యానికి భూపాలపల్లి ప్రెస్ క్లబ్ తరఫున జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.