హన్మకొండ నగరంలో కొనసాగుతున్న ఆ నాలుగు డయాగ్నోస్టిక్స్ విజేత డయాగ్నోస్టిక్స్ దారిలోనే నడుస్తున్నాయి…హంగు ,ఆర్భాటాలతో డయాగ్నోస్టిక్స్, స్కాన్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఈ నాలుగింటికి ఎలాంటి అనుమతులు లేవు….ఎలొర అనుమతులు లేకుండా ఈ నాలుగు డయాగ్నోస్టిక్స్, స్కాన్ సెంటర్లు అధిక రేడియేషన్ గల యంత్రాలతో దందా కొనసాగిస్తున్నారు…సంపాదనపై తప్ప అనుమతులపై ఏమాత్రం దృష్టి సారించని ఈ నాలుగు డయాగ్నోస్టిక్స్ ,స్కాన్ సెంటర్లు వైద్య ఆరోగ్య శాఖ లోని కొందరు అధికారుల అండదండలతో అనుమతులు లేకుండా సెంటర్స్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి… హన్మకొండ లోని కనెక్ట్,టార్గెట్,దేవిక,గ్లోబల్ ,వి బి ఆర్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్ సెంటర్స్ అనుమతులతో మాకేం పనిలేదు స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమకు అన్ని విధాల సహకరిస్తున్నారు అనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తుంది…వైద్య ఆరోగ్య శాఖలోని ఓ అధికారి “ప్రసన్నం”చక్రం తిప్పుతున్న “అశోకు”డి వల్ల డయాగ్నోస్టిక్స్,స్కాన్ సెంటర్స్ తమకేం కాదనే ధీమాలో ఉన్నారు అంటే ఈ సెంటర్స్ ఎలాంటి ఆటంకం ,అనుమతులు లేకుండా నడుస్తున్నాయి అంటే వైద్య ఆరోగ్య శాఖ లోని ఆ ఇద్దరు అధికారుల వల్లేనని…మాస్ మీడియా అధికారిగా ఉన్న ఆ అధికారి మీడియాను ఎవరిని పట్టించుకోకండి మీ ఇష్టారీతిన సెంటర్స్ నడపండి అని ఎక్కడలేని ధైర్యం ఇస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది…అందువల్లే అనుమతులు లేకున్నా,అడ్డగోలు వసూళ్లు చేసిన,కమీషన్ల పేరుతో రోగులను ముక్కు పిండి వసూలు చేసిన,ప్లస్ ,మైనస్ పేరుతో లింగ నిర్ధారణ చేసి వేల రూపాయలు వసూలు చేసిన చర్యలు ఏమాత్రం ఉండడం లేదని విశ్వసనీయ సమాచారం….ఇదిఇలాఉంటే హన్మకొండలో కొనసాగుతున్న ఎస్ ఆర్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్స్ ది మరోరకం ధైర్యం మొన్నటివరకు వరంగల్ లో కొనసాగిన ఎస్ ఆర్ డయాగ్నోస్టిక్స్ ఇప్పడు హన్మకొండలో కొనసాగుతున్న అనుమతులు మాత్రం వరంగల్ వి మాత్రమే కొనసాగిస్తున్నారు…జిల్లా మారిన అనుమతులు తీసుకోకుండా వారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు….ఎలొర అనుమతులు లేని గ్లోబల్,కనెక్ట్,టార్గెట్,దేవిక డయాగ్నోస్టిక్స్ తో పాటు విబిఆర్ లపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా మీన మేషాలు లెక్కించడం ఎందుకో తెలియడం లేదు….
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లో ఆ ఇద్దరు….?
ఆసుపత్రులకు, డయాగ్నోస్టిక్స్, స్కాన్ సెంటర్స్ కు వారిదే అభయం…?
ఈరోజు సాయంత్రం సంచికలో



