పోలీస్ శిక్షణ కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ 129వ జయంతి వేడుకలను మంగళవారం మడికోండ లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అధికారులు, సిబ్బంది సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎర్పాటు చేసిన కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి రవీందర్ ముఖ్య అతిథిగా హజరయి శిక్షణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు కల్పించినహక్కలను పరిరక్షించాల్సిన భాధ్యత మనందరిపై వుందని.

ముఖ్య అంబేద్కర్ రూపోందించిన రాజ్యంగం పట్ల శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుల్లకు అవగాహన కల్పించాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం పోలీస్ కమిషనర్ ర్ పాటు ఇతర పోలీస్ అధికారులు పూల మొక్కలను నాటారు. నివాళులు అర్పించిన వారిలో శిక్షణా కేంద్రం ప్రిన్స్ పాల్ మురళీధర్, వైస్ ప్రిన్స్ పాల్ సాంబయ్య, కాజీపేట ఎ.సి.పి రవీంద్రకూమార్, ఇన్స్‌పెక్టర్లు రామ్మూర్తి , జాన్ నర్సింహులతో పాటు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.