అంబేద్కర్ పై అభిమానాన్నిచాటుకున్న సీఐ

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ పై ఉన్న అభిమానాన్ని ఆయన పట్ల ఉన్న కృతజ్ఞతను చాటుకున్నాడు ఓ పోలీస్ అధికారి. రాజ్యాంగ నిర్మాతగా ప్రజలందరికీ హక్కులు కల్పించిన బాబా సాహెబ్ పట్ల తనకున్న భక్తి శ్రద్దలను ఆ మహనీయుని పుట్టినరోజు సందర్భంగా చాటుకున్నాడు.

కరోన వల్ల లాక్ డౌన్ ఓ పక్క కొనసాగుతున్న నేపథ్యంలో విధులు నిర్వర్తించడంలో తలమునకలై ఉన్న అంబేద్కర్ జయంతిన ఆయన యావత్ భారత జాతికి చేసిన సేవలను గుర్తు చేసాడు. వరంగల్ అర్బన్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ డేవిడ్ రాజ్ యూనివర్సిటీ లోని అంబేద్కర్ విగ్రహాన్ని విద్యార్థుల తో కలిసి శుభ్రం చేసి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆ మహనీయుని సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.