పేకాట రాయుళ్ల అరెస్ట్

నగదు తో పాటు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం క్రోసూర్ పల్లి గ్రామంలో పేకాట స్థావరాల పై మంగళవారం పోలీసుల దాడులు నిర్వహించారు. పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు చిట్యాల ఎస్ ఐ వీరభద్రరావు తెలిపారు కోసుర్పల్లి గ్రామంలోని యండి అక్బర్ ఇంట్లో పేకాట ఆడుతున్నారని పక్కసమాచారంతో తమ సిబ్బంది తో దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 7గురు పేకాట రాయుళ్లను పట్టుకొని వారి వద్ద నుండి 8100 నగదు 5 మొబైల్ ఫోన్లు , 4 బైకులు , స్వాధీనం చేసుకొని సీజ్ చేసి పేకాట ఆడుతున్న గుండాదినేష్, మాటూరి లావన్ బాబు , ఇరుకులపాటి వినయ్, నేపాలీ రాజేష్, యండి అక్బర్, మందనాగరాజు, ర్యాకం సురేష్ లపై కేసు నమోదు చేసి చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here