కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం….?

అక్కడ భూమి ధర ప్రభుత్వ ధరలో కాకుండా కమర్షియల్ గా గజం దాదాపు అరవై వేలు …ఆ ప్రాంతంలో పక్కా భవనాలు అపార్టుమెంట్లు ఇప్పుడిప్పుడే బాగానే అభివృద్ధి చెందుతున్న ప్రదేశం …అలాంటి చోట ప్రభుత్వ భూమి కొంత మిగిలి ఉంది.మట్టి కుప్పలు, చిన్న చిన్న రాళ్లతో నిండిపోయి ఉంది.ఆ ప్రాంతంలో అన్ని చోట్లా నిర్మాణాలు అవుతున్న అక్కడ మాత్రం ఏ నిర్మాణం కావడం లేదు,ఎవరు ఈ భూమి మాది అని వచ్చి చదును చేయడం లేదు.దింతో కొంతమంది ఎవరో తెలియదు కాని అది ప్రభుత్వ భూమి అని తెలిసి కబ్జా చేయడం కోసం చదును చేయడం మొదలుపెట్టారు. గత పది రోజులుగా అర్ధరాత్రి దాటాక ఎవరికి అనుమానం రాకుండా,ఎవరు చదును చేస్తున్నారో తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా జేసిబి తో కొద్దికొద్దిగా భూమిని చదును చేస్తున్నారు.అడిగే వారు ఎవరు లేరు కనుక ఈ కబ్జా కోసం వారు విఫలయత్నం చేస్తున్నారు. హన్మకొండ లోని జూ పార్క్ ఎదురుగా ఉన్న దీన్ దయాల్ నగర్ లో కొంతమంది అక్రమార్కులు భూకబ్జా కు యత్నిస్తున్నారు.కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని చదును చేసి ఏవో సాకులు చూపి స్వాధీనం చేసుకోవాలని చదును చేస్తున్నారు.ఈ విషయాన్ని కొంతమంది స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా రెవెన్యూ అధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.భూమిని చదును చేసినవారు ఎవరో తెలుసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం....?- news10.app

 

ప్రజాప్రతినిది హస్తం…?

కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రాత్రికి రాత్రే చదును చేసి కబ్జా యత్నం చేయడం వెనుక ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉందని ఇక్కడి స్థానికులు అంటున్నారు.ఇంతటి విలువైన భూమిని ఎవరో అనామకులు ఎలా కబ్జాకు యత్నిస్తారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ కబ్జా వెనుక ఓ ప్రజాప్రతినిధి హస్తం తప్పకుండా ఉందని వారు అంటున్నారు.ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమి సూచిక బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here