మిల్లు కబ్జా స్థలం ప్రభుత్వ పరం

అక్రమానికి పాల్పడిన ఆ మిల్లు యాజమాన్యానికి షాక్ తగిలింది.ప్రభుత్వ అసైన్డ్ భూమిని అప్పనంగా స్వాధీనం చేసుకోవాలన్న ఆత్యాశకు బ్రేక్ పడింది . న్యూస్10 వరుస కథనాలతో స్పందించిన రెవెన్యూ అధికారులు మిల్లు యాజమాన్యం అక్రమంగా ఆక్రమించుకున్న భూమినీ ప్రభుత్వ ఆధీనంలోకి తెనున్నారు.వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులోని 494 సర్వే లో ఎకరం10 గుంటల అసైన్డ్ భూమిని కవిత కాటన్ మిల్లు యాజమాన్యం అక్రమంగా ఆక్రమించుకున్న విషయం పై న్యూస్-10 లో జూన్ మాసంలో వరుస కథనాలు వచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే ఈ కథనాల నేపథ్యంలో ఎట్టకేలకు కదిలిన రెవెన్యూ అధికారులు మిల్లు యాజమాన్యం అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ అసైన్డ్ భూమిని స్వాధీన పరుచుకున్నట్లు తెలిసింది.ఈ మేరకు వరంగల్ ఆర్డీవో మహేందర్ జి న్యూస్10 ప్రతినిధితో మాట్లాడుతూ అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.మిల్లు యాజమాన్యం ప్రభుత్వ అసైన్డ్ భూమిలో అక్రమంగా కట్టిన ప్రహరిని తొలగించి ,ఆ భూమికి హద్దులు నిర్ణయించి త్వరలోనే పెన్సింగ్ చేయనున్నట్లు చెప్పారు.

మిల్లు కబ్జా స్థలం ప్రభుత్వ పరం- news10.app మిల్లు కబ్జా స్థలం ప్రభుత్వ పరం- news10.app

న్యూస్10 కు అభినందనలు…

అధికారులను ఎప్పటికప్పుడు కదిలిస్తూ కబ్జాదారుల వెన్నులో వణుకుపుట్టించే విధంగా వరుస కథనాలను ప్రచురితం చేసి భూమిని కాపాడడంలో ముందువరుసలో నిలిచిన న్యూస్-10 కు పలు సంఘాలు గొర్రెకుంట ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూమిని కాపాడటంలో న్యూస్10 తనవంతు పాత్రను పోషించిందని పలువురు అభినందించారు.

ప్రహరిని కూల్చి వేయాలి…

కవిత కాటన్ మిల్లు అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీన పర్చుకోవడమే కాకుండా ప్రహారీని కూల్చివేసి ప్రభుత్వ భూమి అని సూచించేలా బోర్డ్ పెట్టాలని గొర్రెకుంట వాసులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రెవెన్యూ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా త్వరగానే ఈ పని పూర్తి చేయాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here