అవినీతికి కవచం ఆ మిల్లు….?

హన్మకొండ జిల్లా పలివేల్పుల గ్రామంలో జరిగిన దాన్యం కొనుగోలు అక్రమాల్లో వరంగల్ జిల్లాలోని నగర శివారులోని ఓ మిల్లు యాజమాన్యం భాగం పంచుకున్నట్లు తెలిసింది. గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అసలు కొనుగోళ్లు జరగనున్న లక్షల రూపాయలు కొట్టేశారు… ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించగా తాజాగా మిల్లు వ్యవహారం బయటపడింది… ఈ విషయం అధికారుల దృష్టికి సైతం వచ్చినట్లు సమాచారం. దాన్యం కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపించిన అధికారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నగర శివారులోని ఆ మిల్లుకు పంపినట్లు రికార్డుల్లో చూపినట్లు తెలిసింది. దింతో అసలు కొనుగోళ్లు జరగని పలి వేల్పుల సెంటర్ లో కొనుగోళ్లు జరిపినట్లు లావాదేవీలు జరిగినట్లు రికార్డుల్లో చూపి అక్రమంగా దాన్యం డబ్బులు మింగడంలో ఈ మిల్లు యాజమాన్యం సైతం తనవంతు సాయం చేసి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దొంగ లెక్కలు చూపి సర్కార్ ఖజానాకు గండి కొట్టడంలో ఆ మిల్లు యజమాని అక్రమార్కులకు సహకరించినట్లు రూడి అవుతుంది.

అవినీతికి కవచం ఆ మిల్లు....?- news10.app

లెక్క సరే…. దాన్యం ఎలా….?

పలివేల్పుల లో కొనుగోళ్లు జరగకున్న జరిగినట్లు చూపించి లక్షల రూపాయలు నొక్కివేసిన అధికారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వరంగల్ నగర శివారులోని ఓ మిల్లుకు పంపినట్లు తెలుస్తుంది. ఈ మిల్లు యాజమాన్యం సివిల్ సప్లై లో అవినీతికి “కవచం” గా మారినట్లు తెలిసింది. కొనుగోలు చేసిన దాన్యాన్ని ఈ మిల్లుకు పంపించినట్లు రికార్డ్ లో చూపారు సరే… మరి పంపిన ధాన్యానికి సర్కార్ కు పంపాల్సిన బియ్యాన్ని ఎలా పంపుతారానేదే ప్రశ్న…. కానీ దీనిని ఆ మిల్లు యాజమాన్యం చాలా సింపుల్ గా తీసుకుంటుందట… మిల్లు యాజమాన్యం అక్రమంగా పి డి ఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని సర్కారుకు పంపి చాలా ఈజీగా ఈ పని కానిస్తారని కొందరు అంటున్నారు. కొనుగోళ్లు లేకున్నా సర్కార్ దగ్గర నుంచి నొక్కేసిన డబ్బులో ఈ మిల్లుకు వచ్చిన వాటాలో ఇలా రీసైక్లింగ్ చేసిన బియ్యానికి కనీసం ఓ పది శాతం కూడా ఖర్చు కాదని తెలిసింది. ఈ వ్యవహారం మొత్తం హన్మకొండ జిల్లాలోని సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చక్కబెట్టినట్లు కావాల్సిన మిల్లును కూడా తానే సెట్ చేసి కార్యాలయం నుంచే ఈ అక్రమానికి ప్రణాళిక రచించినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి తిలా పాపం తలా పిడికెడు”అన్న చందాన మిల్లు తో సహా అందరూ కలిసి పలివేల్పుల సెంటర్ పేరుతో కోటి రూపాయలకు పైగా అక్రమానికి పాల్పడినట్లు తెలుస్తుంది.మరి ఈ అక్రమార్కుల పై ఉన్నతాధికారులు ఎప్పుడు కొరడా జులిపిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here