గులాబీలో ఎం జరిగింది….?

గెలవడం చాలా సులువు అనుకున్నారు…అధికారంలో ఉన్నాము ఉప ఎన్నిక ను ప్రభావితం చాలా సులువుగా చేయవచ్చు అనుకున్నారు.ఉద్యమ అనుభవం, ఏడేళ్ల పాలన అనుభవం, అధికార యంత్రాంగం సహకారం గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. ఐయిన ఎందుకు నిర్లక్ష్యం చేయాలి కాస్త గట్టిగానే ఎఫర్ట్ పెడదాం అనుకున్నారు. ట్రబుల్ షూటర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దాదాపు అందుబాటులో ఉన్న గులాబీ శ్రేణులన్నింటిని హుజురాబాద్ నియోజకవర్గంలో మోహరించారు… అదనంగా కొన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు దళిత బంధు లాంటి పథకాన్ని సైతం ప్రారంభించారు ఇంతచేసిన ఫలితం ప్రతికూలంగానే వచ్చింది…. దింతో గులాబీ అధిష్టానానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది… ఓటమిని చాలా తేలికగా తీసుకున్నట్లు స్టేట్మెంట్లు ఇస్తున్న, ట్వీట్ లు చేస్తున్న గులాబీలో మాత్రం నిన్నటి రాత్రి నుంచే ఓ అంతర్మధనం మొదలైయిందట. అసలు ఎక్కడ లోపం జరిగింది ఏది అనుకూలత? ఏది ప్రతికూలత…? అనే అంశాలపై ఓ చర్చ నడుస్తోందట. గులాబీ బాస్ తో సహా అందరూ హుజురాబాద్ పోస్టుమార్టం మొదలుపెట్టారట. ఈ పోస్టుమార్టం లో రకరకాల కారణాలపై చర్చోపచర్చలు నడుస్తున్నాయట.

గులాబీలో ఎం జరిగింది....?- news10.app

వర్గాలుగా చీలిపోయార….?

గులాబీ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీష్ రావు ఈసారి రెండో ఓటమిని తన ఖాతాలో వేసుకున్నారని అందరూ అంటుంటే కాదు కాదు ఖాతాలో పడేలా చేశారని కొందరు గులాబీ నాయకులే చర్చించుకుంటున్నారట. హుజురాబాద్ లో గులాబీ అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు ,ఎమ్మెల్యేలు ప్రచారం కోసం వెళ్లడం, నియోజకవర్గం లోని మండలాలకు కొందరు ఇంఛార్జీలుగా కొనసాగడం జరిగింది. ఇదంతా బాగానే ఉన్నా ఇలా ఇంచార్జ్ లు గా ఉన్నవారు ప్రచారంలో పాలు పంచుకున్నవారు అధికశాతం మంత్రి కేటీఆర్ వర్గానికి సంబంధించిన వారుగా ఇప్పుడో ప్రచారం జరుగుతోంది. ఈ గెలుపుతో మంత్రి హరీష్ రావుకు పేరు రాకుండా వీరు ఇంచార్జ్ లుగా ఉండి తూతూ మంత్రంగా ప్రచారం చేశారని… పోల్ మ్యానేజ్ మెంట్ పై సరైన దృష్టి పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. వీరి మూలంగా హుజురాబాద్ లో అంతమంది మోహరించిన ఘోర ఓటమి తప్పులేదని కొందరు వాదిస్తున్నారు. ఇదిలాఉండగా ఇంచార్జ్ గా ఉన్న ఓ ఎమ్మెల్యే రాసలీలల విషయంలో ఆరోపణలు ఎదుర్కొవడం,అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడం గులాబీ ప్రతిష్టకు ఒకింత కీడు చేసిందని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం పనిచేయాల్సిన గులాబీ ప్రజాప్రతినిధులు హరీష్ రావు, కేటీఆర్ వర్గాలుగా చీలిపోయి ఇష్టారీతిన వ్యవహరించడం గెలుపుకు దూరం కావడం, ఈటల కు భారీ మెజార్టీ వచ్చేలా చేసిందని గులాబీ శ్రేణులు చర్చించుకుంటుండగా… ఈ చర్చ అధిష్టానంలో సైతం జరుగుతున్నట్లు సమాచారం.

కౌన్సిలర్లు కొంప ముంచార….?

ఇక మొదటి నుంచి హుజురాబాద్ టౌన్ లో గులాబీకి ఓట్లు గంపగుత్తగా పడతాయని టీఆర్ఎస్ నాయకులు భావించారు కానీ మొదటగా లెక్కించిన ఓట్లు ఇవే కాగా మొదటి రౌండ్ నుంచే ఈటల ఆధిక్యాన్ని కొనసాగించారు. దింతో పట్టణంలో సైతం గులాబీకి ఓట్లు తక్కువగానే పడినట్లు స్పష్టం ఐయింది… ఇలా ఇక్కడ ఓట్లు తక్కువగా పడడానికి కౌన్సిలర్లే కారణంగా గులాబీ నాయకులు భావిస్తున్నారు. వీరు ప్రచారాన్ని చాలా తేలికగా తీసుకున్నారని,ఆరు వేల పంపిణీ గొడవలకు వీరే కారణం ఐయారని చెప్పింది చెప్పినట్లుగా చేయడంలో వీరు విఫలం ఐయారని గులాబీలో వీరిపై చర్చ జోరుగా కొనసాగుతుందట. ఓటర్లందరిని కలవకుండా కొందరినే కలిసి తప్పుడు ప్రచారానికి ఆజ్యం పోసారని వీరిపై అధిష్టానం సైతం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి హుజురాబాద్ లో గులాబీకి ఘోర పరాభవం తర్వాత ఇప్పుడు చర్చోపచర్చలు బాగానే జరుగుతున్నాయట.. ఈటల రాజేందర్ కు ఎంతగా ప్రజాభిమానం ఉన్న కొన్ని పనులతో విజయానికి అతి సులువుగా గండి కొట్టి ఎగిరిపడే కొందరు గులాబీ నాయకులకు హెచ్చరిక పంపుదామని అనుకున్న గులాబీ దళపతి కి అపజయం ఎదురు కావడంతో ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగిందని తల పట్టుకునేంత పని ఐయిందట ఐయిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది ఈ అపజయం ఎంత అని కేటీఆర్ వంటి నాయకులు జానేదో అని లైట్ గా తీసుకున్న గులాబీలో హుజురాబాద్ ఓటమిపై పోస్టుమార్టం కొనసాగుతూనే ఉందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here