ధరణి పేరుతో వసూళ్ల దందా….?

రైతుల భూమి సమస్యలు పరిష్కారం చేయడం తనవల్ల కాకుంటే ఉన్నతాధికారులకు చెప్పి రైతులకు ఉచితంగా సలహాలు ఇవ్వడం అతని ఉద్యోగం… ఔట్ సోర్సింగ్ కింద కొలువు చేస్తున్న అతనో కీలకమైన వ్యక్తి కోఆర్డినేటర్ గా బాధ్యతలు వెలగబెడుతున్న ఉద్యోగి కానీ అతను ఇవన్నీ మరిచి రైతులను రాచి రాంపాన పెట్టి అందినకాడికి దండుకుంటున్నాడట… ప్రతి పనికో రేటు పెట్టి తన ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూశాఖ లో ఇకపై ఎప్పుడూ అవినీతి జరగకుండా ఉండేందుకే వి ఆర్ ఓ వ్యవస్థను తీసేసి “ధరణి”పోర్టల్ తీసుకొచ్చామని ఇకనుండి ఎవరు ఎక్కడకూడా లంచం అనేది ఇవ్వొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి గర్వంగా అసెంబ్లీలోను, పలు బహిరంగాసభల్లోను చెప్తువస్తున్నారు కానీ అదే “ధరణి” పేరుతో పెద్ద దందానేనే నడుస్తుందనే విషయాన్ని అధికారులు కానీ సర్కార్ కానీ గ్రహించలేకపోతుందనిపిస్తోంది.

ధరణి పేరుతో వసూళ్ల దందా....?- news10.app

రైతుల మంచి కోసం తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ఈ ధరణి ఇప్పుడు కొంతమందికి వరంలా మారి కాసులు కురిపిస్తుందట. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ, ఇకపై ఎలాంటి అక్రమవసూళ్ళు ఉండవనే ప్రభుత్వ సంకల్పానికి గండి కొడుతూ అదే ధరణి పోర్టల్ ను తన అక్రమార్జనకు అడ్డాగా మలుచుకొన్నాడట ఓ ధరణి కోఆర్డినేటర్. వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ధరణి కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా కొనసాగుతున్న ఇతడు ప్రతి పనికో రేటు పెట్టి రైతులవద్ద డబ్బుల దోపిడీకి పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగి ధరణి సమస్యలతో వచ్చే సాధారణ రైతులను చిన్నచూపు చూస్తూ బడా పారిశ్రామిక వేత్తలకు,పేరుపొందిన రియల్టర్ లకు పెద్దపీట వేస్తున్నాడని కార్యాలయ ఉద్యోగులే కోడైకూస్తున్నారు.

ధరణి లో ఏదన్నా సమస్య ఉందని రైతులు కలెక్టర్ కార్యాలయానికి వస్తే చాలు అతగాడిని దర్శనం చేసుకొని కావాల్సింది సమర్పించుకోవాల్సిందేనట ఆయనను కలవకుండా ఎవరికయినా సమస్య చెప్పుకుంటే ఆ పని జరగకుండా అడ్డుకోవడంలో ఆయన సిద్ధహస్తుడని జోరుగా ప్రచారం జరుగుతోంది… ఇటీవలే నగరంలోని ఓ లిక్కర్ వ్యాపారికి చెందిన గీసుగొండ మండలం లోని 6 ఎకరాల భూమిని నిషేధిత జాబితానుండి తొలగించేందుకు 4 లక్షల రూపాయలు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇదే మండలంలోని ఓ మిల్లు యజమాని ప్రభుత్వ అసైన్డ్ భూమిని కబ్జా చేసి ప్రహారీ నిర్మించుకున్న ఆ పెద్దమనిషికి తహసీల్దార్ ప్రహారీ కూల్చేస్తామని నోటీసులు ఇవ్వగా సదరు యజమాని నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడట… అయితే కోర్టులో కేసు గెలవమని గ్రహించిన కాటన్ మిల్లు యజమాని కేసు వాపసుతీసుకొని ఈ భూమి సమస్యను తీర్చాలని కలెక్టర్ కార్యాలయంలోని ఆ ఉద్యోగిని ఆశ్రయించాడట…. ఇదే అదునుగా భావించిన సదరు ధరణి కోఆర్డినేటర్ మిల్లు యజమనితో 6 లక్షలకు డీల్ కుదర్చుకొని అడ్వాన్స్ గా 3 లక్షలు తీసుకొని మిగితా డబ్బులు పని అయినాక చెల్లించాలని డీల్ కుదుర్చుకున్నాడని విశ్వసనీయ సమాచారం.ధరణి పేరుతో ఈ ఉద్యోగి రైతులని, భూ యజమానులవద్దనుంచి రోజుకు కనీసం లక్షరూపాయలు వసూలు చేస్తున్నట్లు వరంగల్ కలెక్టరేట్ లో కొందరు ఉద్యోగులే అంటున్నారు.

అధికారులకు తలనొప్పి…?

రైతులను,భూ యజమానులను పనులనిమిత్తం డబ్బులు డిమాండ్ చేస్తున్న ధరణి కోఆర్డినేటర్ వ్యవహారం కలెక్టరేట్ లో అధికారులకు తలనొప్పిగా మారిందట. ధరణి లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా కొనసాగుతున్న ఇతన్ని ప్రభుత్వ ఉద్యోగి కాదు కనుక అధికారులు ఎం చర్యలు తీసుకోకుండా,పల్లెత్తు మాట కూడా అనకుండా గమ్మున ఉంటున్నారుట. ఇతడిపై ఇప్పటికే అనేక ఫిర్యాదు లు వచ్చిన ఎం చేయాలో తెలియక అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు తెలిసింది.

ఇల్లే పైరవీల నిలయం…?

వరంగల్ కలెక్టరేట్ లో ధరణి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న ఇతగాడు తన ఇంటిని పైరవీలకు నిలయంగా మార్చినట్లు తెలిసింది. ఈ అక్రమవసూళ్ళ తతంగాన్నంత కలెక్టర్ కార్యాలయంలో కాకుండా అత నుండే హంటర్ రోడ్ లోని ఓ ఇంట్లో పూర్తిచేస్తాడాట. రోజు సాయంత్రం కాగానే ధరణి లో భూ సమస్యలు ఉన్నవారు, రియలేస్టేట్ యజమానులు ఇక్కడ కలిసి కోఆర్డినేటర్ ను ప్రసన్నం చేసుకొని, కావాల్సింది సమర్పించుకొని పోతారట. ఇదిలావుండగా కలెక్టర్ కార్యాలయం కు భూ సమస్యకోసం వచ్చే వారిని న్యూస్10 ప్రతినిధి పలకరిస్తే సుమారు 50 మంది సాయిదర్శనం కోసమే వచ్చామనడం కొసమెరుపు. రైతులు,సమస్యలున్నా భూ యజమానుల వద్ద నుంచి డబ్బులు దండుకొని ధరణి కోఆర్డినేటర్ ఉద్యోగాన్ని అక్రమానికి వాడుకుంటున్న ఈ ఉద్యోగిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here